భారత్ లోని  సంపన్నుల్లో ఎన్నో ఏళ్ల నుంచి మొదటి స్థానంలో కొన సాగుతూ తన సంపదను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు ముఖేష్ అంబానీ. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ధీరుబాయ్ అంబానీ వారసుడిగా ఇంకా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ముఖేష్ అంబానీ. ముఖ్యంగా రిలయన్స్ జియో అనే టెలికాం రంగ సంస్థ ను స్థాపించి ప్రస్తుతం ఎక్కడా వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. టెలికాం రంగంలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే. అప్పటివరకు టెలికాం రంగ దిగ్గజ సంస్థలను  సైతం అయోమయంలో పడేసింది రిలయన్స్ జియో.



 తక్కువ ధరకే టారిఫ్  అందించిన రిలయన్స్ జియో అప్పటివరకూ టెలికాం రంగ సంస్థల్లో దిగ్గజాలు గా కొనసాగుతున్న ఐడియా ఎయిర్టెల్ లాంటి సంస్థలను  సైతం కష్టాలపాలు చేస్తుంది అని చెప్పాలి. తక్కువ సమయంలోనే ఎంతోమంది వినియోగదారులను ఆకర్షించేంచింది  రిలయన్స్ జియో. ఊహకందని విధంగా ఒక్కసారిగా మార్కెట్ లోకి దూసుకు వచ్చి ఎంతో సక్సెస్ సాధించింది. ఇక ఇప్పటికి కూడా రిలయన్స్ జియో ద్వారా ఎన్నో సర్వీసులను అందిస్తున్నారు ముఖేష్ అంబానీ. ఇక ప్రజలందరికీ టెలికాం రంగ సేవలు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.



 ఇటీవలే రిలయన్స్ జియో సంస్థ గురించి అధినేత ముఖేష్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తన తండ్రి ధీరుబాయి అంబానీ అడిగిన ప్రశ్నకు ప్రతిరూపమే ప్రస్తుతం జియో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖేష్ అంబానీ. పోస్టుకార్డు ఖర్చుతో ఒకరితో ఒకరు మాట్లాడుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుందా అని ఒకానొక సమయంలో తన తండ్రి దిరూభాయి  అంబానీ తనను అడిగారని ముఖేష్ అంబానీ చెప్పుకొచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానమే తక్కువ టారీఫ్స్ లో తీసుకొచ్చిన జియో  అంటూ చెప్పుకొచ్చారు. దేశాన్ని ఆత్మ నిర్బర్  భారత్ గా మార్చేందుకు తయారీ రంగాన్ని మరింత ప్రోత్సహించాలి అంటూ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: