ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో  నెలకొన్న ఉద్రిక్తత  దృశ్య ఏ క్షణంలోనైనా యుద్ధం తలెత్తే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం భారత్ చైనా పై ప్రత్యక్షంగా యుద్ధం చేయడం లేదు కానీ పరోక్షంగా మాత్రం ఎన్నో రకాలుగా యుద్ధం చేస్తోంది. ఓవైపు సరిహద్దుల్లో శరవేగంగా సైనికులను ఆయుధాలను మోహరిస్తూ మానసికంగా చైనా సైనికులతో భారత యుద్ధం చేస్తుంది. అదే సమయంలో దౌత్యపరంగా వివిధ దేశాలతో సంబంధాలను మెరుగు పరుచుకుంటూ చైనాతో యుద్ధం జరిగితే భారత్ లు  అండగా నిలబడేందుకు  వివిధ దేశాలు  సిద్ధ పడేలా ప్రస్తుతం  దౌత్య పరంగా కూడా చైనాతో యుద్ధం చేస్తుంది.



 ముఖ్యంగా భారత్ చైనా పై ఆర్థిక యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ భారత్ క్రమక్రమంగా చైనా కు షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే చైనా సరిహద్దుల్లో తలెత్తిన వివాదం నేపథ్యంలో చైనా కు భారీ ట్విస్ట్ ఇచ్చింది భారత్. తమ దేశ భూభాగమే  అంటూ చెప్పుకుంటూ ఎన్నో ఏళ్ల నుంచి ప్రగల్భాలు పలుకుతున్న తైవాన్ విషయంలో కీలక అడుగు ముందుకేసింది. ఇప్పటికే సైనిక చర్యతో తైవాన్ ను  స్వాధీనం చేసుకోవాలి అని చైనా అనుకుంటున్న తరుణంలో ప్రపంచ దేశాలు మొత్తం తైవాన్ కి  అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.




 ఈ క్రమంలోనే తైవాన్  విషయంలో భారత్ మరో కీలక అడుగు ముందుకు వేసి  చైనా కు భారీ ట్విస్ట్ ఇచ్చింది. ఏకంగా తైవాన్ తో  వాణిజ్యపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 10 లక్షల కోట్ల స్మార్ట్ఫోన్లు తయారు చేసేందుకు ఇటీవల తైవాన్ తో ఒప్పందం కుదుర్చుకుంది భారత్. మేకిన్ ఇండియా లో భాగంగా తైవాన్ కంపెనీలైన ఫాక్స్ కన్.. సహా మరో రెండు కంపెనీలకు 10 లక్షల కోట్ల స్మార్ట్ఫోన్లు తయారీకి భారత రంగం సిద్ధం చేసింది. మేకిన్ ఇండియా లో భాగంగా ఈ స్మార్ట్ఫోన్ను కేవలం చైనా ఫోన్ల ధరకే  భారత్ లో  విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీంతో ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృశ్య ఈ నిర్ణయంతో చైనా కు భారీ ట్విస్ట్ ఇచ్చింది భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి: