అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం జగన్.. రైతులందరికీ చేయూతనందించే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. ఇక రైతులందరికీ పెట్టుబడి సాయం అందించేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ అనే సరికొత్త ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టి రైతులందరి ఖాతాల్లోకి నేరుగా పెట్టుబడి సాయం పంపిస్తున్న విషయం తెలిసిందే.



 ప్రతి ఏడాది మూడు దఫాలుగా పెట్టుబడి సహాయాన్ని అందిస్తుంది జగన్మోహన్రెడ్డి సర్కార్. కాగా నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం లో అర్హులందరికీ ఖాతాల్లోకి 2000 జమ చేయనుంది జగన్ సర్కార్. ఈ కార్యక్రమాన్ని నేడు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి ఆన్లైన్ వేదికగా ప్రారంభించనున్నారు. ఇక ఈ రెండో విడతలో భాగంగా దాదాపుగా రెండు వేల రూపాయల సహాయాన్ని రైతులందరి ఖాతాలో జమ చేయనున్నారు.  మొత్తం 50 లక్షల మంది రైతులకు 1114 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.



 దీంతో రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెట్టుబడి సాయం తో పాటు ఇప్పటికే వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జగన్మోహన్రెడ్డి సర్కార్ నడుంబిగించిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో భారీ పంట నష్టం ఏర్పడింది. లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంట దగ్ధమైంది.ఈ క్రమంలో రైతులందరూ అయోమయ స్థితిలో పడిపోయారు. అయితే వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చి  అండగా నిలిచేందుకు జగన్మోహన్ రెడ్డి  సర్కార్  నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి  సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: