కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు భారత్ ను  ప్రపంచ నెంబర్వన్ స్థానానికి చేర్చే విధంగా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే, ఇప్పటివరకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఒకవైపు ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూనే మరోవైపు దేశ అభివృద్ధి గురించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా భారత్ ను  అగ్రస్థానంలో నిలబెట్టేలా  కనిపిస్తున్నాయి.



 కేవలం దేశంలో పాలన పరంగానే కాదు ఇతర దేశాలతో సంబంధాలు కొనసాగించడంలో  దౌత్య పరంగా కూడా ఎంతో వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతోంది భారత్. ఇప్పటికే పలు విషయాలలో  ప్రపంచ నెంబర్వన్ స్థానంలో ఉంది భారత్.  మరి కొన్ని రోజుల్లో మరో విషయంలో కూడా ప్రపంచంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం భారత్లోనే ఉంది అన్న విషయం తెలిసిందే. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టించిన అనంతరం భారత్ ఈ ఘనత సాధించింది.



 ఇక అంతే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో రైల్వే మార్గం ఉన్న విషయం లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో సొరంగ మార్గం కూడా భారత్ లోనే ఉంది. ఇలా ఎన్నో ప్రపంచ రికార్డులను భారత సొంతం చేసుకుంటూ ఉంది భారత్. ఇక ఇప్పుడు మరో అరుదైనటువంటి ప్రపంచ రికార్డు సొంతం కాబోతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్లోని గిర్నార్ పర్వతం వద్ద ఒక రోప్వే నిర్మించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన దేవాలయ రోప్ వే  కింద రికార్డు సృష్టించనుంది. 130 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. అయితే ఈ రోప్ వే  ద్వారా గంట వ్యవధిలో ఏకంగా వెయ్యి మంది భక్తులు దేవాలయానికి చేర్చేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: