ఈ రైతుకు చెందిన 18 ఎకరాల భూమిని అచ్చెన్నాయుడి అండతో సోదరుడు కింజరపు హరి ప్రసాద్ తన స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినట్లు తెలిపారు. వారు చెప్పిన ధరకు భూములు విక్రయించేందుకు అంగీకరించలేదని రామ్మూర్తిపై, కుమారుడిపై దౌర్జన్యాలకు పాల్పడటంతో వారు గత్యంతరం లేక వేరే గ్రామాల్లో తలదాచుకున్నారు. కుమారుడు బంజీరు పేటలో, రామ్మూర్తి పెద్దబమ్మిడి, చిన్నబమ్మిడి గ్రామాల్లో అద్దె ఇళ్లల్లో ఉన్నారు.
మెండ రామ్మూర్తి అనే రైతుకు గ్రామం చుట్టు పక్కల 18 ఎకరాల భూములు ఉన్నాయి. అచ్చెన్నాయుడు, హరి ప్రసాద్ కుటుంబంకు అనుకూలంగా వారికి పొలాలను అప్పగించకుండా ఎదురు తిరిగామన్న కక్షతో పంటలు పండించకుండా చేస్తున్నారు. తక్కువ ధరకు ఇవ్వమని బాధిస్తున్నారు అంటూ వాపోయాడు. అంతేకాదు ఆ రైతు ఏమన్నాడంటే ....ఇటీవల సొంతింటికి వచ్చిన నాపై ఇప్పుడు కూడా బెదిరింపులు ఎదురయ్యాయి. నాకు ఎవరైనా సాయం చేస్తే వారికి ఇబ్బందులు తప్పవంటూ హరి ప్రసాద్ హెచ్చరిస్తున్నాడు.... అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు ఆ రైతు. ఇలాంటివి ఇంకా కొనసాగుతుండటం చాలా బాధాకరమైన విషయం. ఇకనైనా ఇలాంటి వాటికి స్వస్తి చెప్పి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేపట్టాలని ఇది తెలిసిన పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది తెలిసిన ప్రభుత్వం వీరిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి