తాజగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో ఘటన చోటు చేసుకుంది. 27 ఏళ్ల ఓ యువతి చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. నెల కిందట ఆమె పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం చేసుకుంది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. కానీ, వివాహమైన కొన్ని రోజులకే తన భర్తకు బట్టతల ఉందని తెలిసింది. అత్తమామలు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఆమె వినిపించుకోకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని మీరా రోడ్డులో నివాసం ఉంటే 29 ఏళ్ల వ్యక్తి నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతడికి బట్టతల ఉండటంతో కొంత కాలంగా విగ్గు వాడుతున్నాడు. అయితే నెల రోజుల కిందట అతడు ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి సంబంధం మాట్లాడే సమయంలో తనకు బట్టతల ఉన్న విషయాన్ని అమ్మాయికి కానీ కుటుంబ సభ్యుల దగ్గర దాచిపెట్టాడు.పెళ్లైన కొన్ని రోజులకే భార్యకు నిజం తెలిసిపోయింది.

ఆమె తన భర్త అతడికి బట్టతల ఉన్న విషయం దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్నాడని బాధిత మహిళ నయా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. ఇక భర్తను సమర్థించిన అతడి తల్లిదండ్రులపైనా ఫిర్యాదు చేసింది. పెళ్లి చూపుల సమయంలోనే అతడికి బట్టతల ఉందనే విషయం తెలిస్తే.. ఆ సంబంధాన్ని తిరస్కరించి ఉండేదాన్నని బాధిత మహిళ పోలీసుల వద్ద తన భాధను వ్యక్తం చేసింది. అంతేకాదు ఆమె తనను మోసం చేసి పెళ్లి చేసుకొని తన పరువుకు నష్టం కలిగించాడని ఫిర్యాదులో వెల్లడించింది.

ఇక బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 406 (నమ్మక ద్రోహం), 500 (పరువు నష్టం) కింద కేసులు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకొని కస్టడీకి తరలించారు. నిందితుడు యాంటిసిపేటరీ బెయిల్ కోరుతూ థానే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: