ఇక ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఆసక్తికరంగా మారింది. ఈవారం ఇంటి నుంచి బయటకు పోయేది ఎవరు అన్నదానిపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే మెహబూబ్ అమ్మరాజశేఖర్ లలో ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు అని అనుకున్నారు ప్రేక్షకులు. ఓట్లు కూడా వారికే తక్కువగా వచ్చాయి. అయితే చివరికి ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున అమ్మరాజశేఖర్ ఎలిమినేట్ అయినట్లు నిన్న బిగ్ బాస్ హౌస్ లో తెలిపాడు. ఇక 8 వారాలు ముగిసిన తర్వాత అమ్మ రాజశేఖర్ మాస్టర్ ప్రయాణం కాస్త ముగిసిపోయింది. ఇంటి సభ్యులు ఓటింగ్ పెట్టినప్పటికీ అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ కావాలని 8లో 6 మంది సభ్యులు ఓటేశారు.
దీంతో అమ్మరాజశేఖర్ ఎలిమినేట్ అయ్యాడు అన్న విషయం నాగార్జున చెప్పారు . అమ్మ రాజశేఖర్ హౌస్ లో ఉన్న అందరితో కూడా ఎంతో ఎఫెక్షన్ గా ఉండడం తో అందరూ అమ్మరాజశేఖర్ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాడు అని కన్నీళ్లు పెట్టుకున్నారూ . ఇక మాస్టర్ కూడా తన లగేజి మొత్తం సర్దుకొని బయటికి వెళ్లేందుకు బిగ్బాస్ హౌస్ డోర్ దగ్గరికి వచ్చాడు. కానీ చివరలో ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. నోయల్ ఈ వారం అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవడంతో ఎవరిని ఎలిమినేట్ చేయడం లేదంటూ బిగ్ బాస్ రిక్వెస్ట్ చేశాడని.. అందుకే ఈ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్ అంటూ ట్విస్ట్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా ఎగిరి గంతేస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి