కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య విద్యార్థుల ప్రాణాల కు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని పాఠశాలను ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. కానీ జగన్ సర్కార్కు మొదటిలో నే భారీ షాక్ లు తగులుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. నిన్న నెల్లూరు జిల్లా నందనవనం ఆదర్శ పాఠశాలలో ఒక విద్యార్థితో పాటు ముగ్గురు సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. ఇలా పలు స్కూళ్ళలో మొదటి రోజే కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట గంగలకుర్రు లోని ఓ హై స్కూల్ లో కూడా కరోనా వైరస్ కేసులు బయటపడడం ఆందోళనకరంగా మారిపోయింది. హై స్కూల్ లో పని చేస్తే మధ్యాహ్న భోజన నిర్వాహకురాలిగా కరోనా పాజిటివ్ అని రావడం అందరిలో ఆందోళన కలిగించింది. అక్టోబర్ 30వ తేదీన కరోనా వైరస్ పరీక్షలకు వెళ్లిన సదరు మహిళ... ఫలితాలు వచ్చేంతవరకూ ఇంట్లోనే ఉండకుండా స్కూలుకు వెళ్లి విద్యార్థులకు భోజనాలు వడ్డించే పనులు కూడా చేసింది. నిన్న వచ్చిన రిపోర్టులో ఆమెకు పాజిటివ్ అని నిర్ధారణ కాగా ప్రస్తుతం స్కూల్ లో అందరు భయాందోళనలో మునిగిపోయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి