చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా  వైరస్ ప్రస్తుతం భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తుంది. అయితే మొదట లాక్డౌన్ విధించిన సమయంలో అతి తక్కువ కరోనా వైరస్ కేసులు ఉన్న దేశంగా ఉన్న భారత్ అన్లాక్ మార్గదర్శకాలు విడుదల చేస్తున్న కొద్దీ కేసులు భారీగా పెరిగిపోవడంతో భారతదేశం అత్యధిక కరోనా వైరస్ కేసులు ఉన్న దేశాలలో ప్రపంచంలోనే రెండవ స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు అందరిలో  ఆందోళన నెలకొంది.




 మొదటి రెండు మూడు అన్లాక్ మార్గదర్శకాలు విడుదల చేసినప్పుడు ఎప్పుడూ కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగినప్పటికీ ఆ తర్వాత మాత్రం అన్లాక్ మార్గదర్శకాలు విడుదల చేస్తూ అన్ని రకాల కార్యకలాపాలను అనుమతిస్తున్న నేపథ్యంలో దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడమే కాదు రికవరీ రేటు కూడా భారీగా పెరగడం అందరిలో ధైర్యాన్ని కలిగించే విషయం అన్న  తెలిసిందే. ప్రపంచంలోనే అతి ఎక్కువ రికవరీ రేటు ఉన్నటువంటి దేశాలలో భారత్ అగ్ర  స్థానంలో నిలిచింది అని చెప్పాలి. ఇప్పటివరకు 82 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు బయటపడితే 72 లక్షల మందికి పైగా రికవరీ అయ్యారు.



 భారత్లో రికవరీ రేటు 91.67 శాతం ఉంది . ప్రస్తుతం భారతదేశంలో క్రియాశీలక కేసులు మూడు రేట్లు  తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం 5లక్షలకు పైగా కేసులుండగా.. గత వారం రోజుల నుంచి  రోజురోజుకు కరోనా వైరస్ కేసులు సంఖ్య తగ్గిపోతూ ఉండడం శుభపరిణామం అని చెబుతున్నారు నిపుణులు. సెప్టెంబరులో  21 శాతంగా ఉన్న యాక్టివ్ కేసులు ప్రస్తుతం కేవలం ఆరు శాతానికి తగ్గాయి. క్రమ క్రమంగా అన్ని రాష్ట్రాలలో కూడా మొన్నటి వరకు అత్యధిక కేసులు నమోదవగా ప్రస్తుతం క్రమ క్రమంగా అన్ని రాష్ట్రాలు కోలుకొని భారత్లో తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. క్రమక్రమంగా భారత్ కరోనా నుంచి కోరుకుంటుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: