భారత్ చైనా సరిహద్దు లో ఏ క్షణంలో ఏం జరుగుతుంది అన్నది ఊహకందని విధంగా ఉంది అనే విషయం తెలిసిందే. మొన్నటి వరకు సరిహద్దుల్లో  తోక జాడిస్తు  దుందుడుకుగా వ్యవహరించి చైనా ప్రస్తుతం సరిహద్దుల్లో కాస్త సైలెంట్ గా ఉండటం చూస్తే భారత్  ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల గురించి చైనా వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్  ఓడిపోయి జో బైడెన్  అధికారంలోకి వస్తే తర్వాత  మద్దతు కూడగట్టుకొని భారత్ తో  యుద్ధం చేసేందుకు సిద్ధం అవుతోంది అని భారత రక్షణ రంగ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.



 అందుకే మొన్నటివరకు సరిహద్దుల్లో తోక జాడిస్తే దుందుడుకుగా వ్యవహరించిన చైనా ప్రస్తుతం కాస్త సైలెంట్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే చైనాతో ఏక్షణంలోనైనా యుద్ధం తలెత్తే అవకాశం ఉంది అందుకే .. ఏ క్షణంలో యుద్ధం తలెత్తిన ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చైనా కు  ధీటుగా బుద్ధి చెప్పేందుకు భారత్ అంతకంతకు ఎంతో పటిష్టంగా మారుతున్న విషయం తెల్సిందే. శరవేగంగా భారత రక్షణ పరిశోధన సంస్థ డి ఆర్ డి ఓ అభివృద్ధి చేసిన క్షిపణులను క్రమక్రమంగా ప్రయోగాలు నిర్వహిస్తూ భారత అమ్ములపొదిలో చేర్చుతుంది.



 ఇక భారత్ తో రాజి  కుదుర్చు  కోవాలా లేక యుద్ధం చేయాలా అనే దానిపై  చైనా నిర్ణయించుకునే లోపే భారత్ అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ఇక ఇప్పటి వరకు ఎన్నో క్షిపణులకు  ప్రయోగాలు నిర్వహించి  విజయవంతమవ్వగా..  ఇక ఇప్పుడు మరో శక్తివంతమైన క్షిపణి ప్రయోగాలు జరిపింది డి ఆర్ డి ఓ. బ్రహ్మోస్ మిస్సైల్ యొక్క ఎయిర్ లాంచ్డ్  వర్షన్  ఇటీవలే ప్రయోగించి  విజయవంతమైంది. సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ఈ మిస్సైల్   ప్రయోగించగా ఎంతో సమర్థవంతంగా కచ్చితత్వంతో టార్గెట్ ను ధ్వంసం చేసింది. ఈ మిస్సైల్  ప్రయోగం విజయంతో భారత్ మరింత పటిష్టంగా మారింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: