ఏ ఎన్నికల్లో అయినా ఓటు వేయాలంటే పోలింగ్ కేంద్రాల ముందు గంటల తరబడి బారులు తీరాల్సిందే. ఒంట్లో శక్తి ఉన్నా లేకున్నా... ఆరోగ్యం సహకరించినా, సహకరించకపోయినా... ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సిందే. టెక్నాలజీ ఎంత పెరిగినా ఈ కష్టం మాత్రం తప్పడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
గ్రేటర్ ఎన్నికల్లో కొత్త పద్ధతిలో పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను ఎన్నికల్లో ప్రవేశపెట్టిన ఎస్ఈసీ... గ్రేటర్ ఎన్నికల్లో ఈ-ఓటింగ్ సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ-కామర్స్ విధానం ద్వారా భారీ స్థాయిలో లావాదేవీలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో... ఈ-ఓటింగ్ కూడా సురక్షితమేనని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఈ-ఓటింగ్ విధానం అమల్లోకి వస్తే ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ-ఓటింగ్ విధానంపై ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు. సాధ్యమైనంత త్వరలో డెమో ఇవ్వాలని ఎస్ఈసీ కోరింది.
ప్రస్తుతం 14 దేశాలు ఆన్‌లైన్ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. వాటిల్లో ఎస్తోనియా మాత్రమే శాశ్వత జాతీయ ఇంటర్నెట్ ఓటింగ్ విధానం ఐ-ఓటింగ్‌ను ప్రవేశపెట్టింది. 2005లో ఎస్తోనియాలో ఈ-ఓటింగ్ విధానాన్ని మొదలుపెట్టినపుడు... కేవలం 1.9 శాతం మంది మాత్రమే ఇంటెర్నెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఐ-ఓటింగ్ 30 శాతానికి పెరిగింది. ఐ-ఓటింగ్ విధానంలో ఓటర్లు ఎన్నికలకు పది రోజుల ముందే ఎన్నికల సంఘం వెబ్‌సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఈ-మెయిల్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక కోడ్‌ను పంపిస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఎన్నికల రోజు వెబ్‌సైట్‌లో ఈ-బ్యాలెట్ పేపర్ తెరుచుకుంటుంది. మనకు ఇష్టమైన గుర్తుపై ముద్రవేసిన అనంతరం అది రిటర్నింగ్ అధికారి లాగిన్‌లో నిక్షిప్తమైపోతుంది. ఇలా పోలైన ఓట్లను... కౌంటింగ్ రోజు తెరిచి లెక్కిస్తారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి లాగిన్‌లో... మొత్తం పోలైన ఓట్లు... గుర్తుల వారీగా పోలైన ఓట్లు... విడివిడిగా ఉంటాయి. ఎవరు ఏ గుర్తుపై ఓటు వేశారో తెలుసుకునే వీలుండదు. ఉదాహరణకు ఐదు గుర్తులు ఉన్నాయనుకుంటే, 100 ఈ-ఓట్లు పోలైతే... ఆ ఐదు గుర్తుల్లో ఏ గుర్తుకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది తప్పా... ఎవరు ఏ గుర్తుపై వేశారో తెలిసే అవకాశం ఉండదు.
అత్యవసర విధులు, ఎన్నికల విధుల్లో పాల్గొనేవారికి... వికలాంగులు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, ఐటీ ప్రొఫెషనల్స్ తదితరులకు ముందుగా ప్రయోగాత్మకంగా ఈ ఓటింగ్ అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్ సిద్ధమయ్యాక రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి... వారి ఆమోదంతో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇది విజయవంతమైతే... దేశంలో ఈ-ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి నగరంగా హైదరాబాద్ నిలుస్తుంది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి