దేశంలో నిర్వహిస్తున్న అన్ని ఆసుపత్రులు, పోలీ క్లినిక్ లను అనుసంధానం చేసేలా ఓ  అవసరమైన సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసే బాధ్యతను భారత రైల్వేశాఖ రైల్ టెల్ కు, రైల్ టెల్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ కి అప్పగించింది. ఎలాంటి ఇబ్బందులు అడ్డంకులు లేకుండా వైద్యసేవలను అందించాలనే ముఖ్య లక్ష్యంతోనే  ఈ కార్యక్రమాన్ని హెచ్ ఎం ఐ ఎస్ - హాస్పిటల్ మేనేజిమెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం పేరుతో అమలు చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న125 ఆరోగ్య కేంద్రాలు, 650 పోలీ క్లినిక్లలో దీనిని అమలు చేయనున్నారు.

ఆసుపత్రుల నిర్వహణ మరియు సేవలు మెరుగుపరిచేందుకు, అందరికి నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి ఈ సాఫ్ట్ వేర్ బాగా ఉపయోగపడుతుంది. అనేక  వైద్య విభాగాలు, ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ సేవలు అందిస్తున్న ఆసుపత్రుల సమాచారాన్ని అంతా దీనికి అనుసంధానం చేయడం జరుగుతుంది. దీనివల్ల వైద్య సేవలు తాలూకా వివరాలు అనుసంధానం కావడమే కాకుండా రోగులు తమ ఆరోగ్య రికార్డులను తమ ఫోన్ ద్వారా తెలుసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఈ సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేసే బాధ్యతకు సంబంధించి రైల్ టెల్ తో భారత రైల్వే మంత్రిత్వ శాఖ  ఒప్పందంపై సంతకాలు చేసింది. క్లౌడ్ టెక్నాలజీ  ద్వారా హెచ్ఎంఐఎస్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తారు.

అన్ని రంగాలలో డిజిటలైజెషన్ కు ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో మార్పులను గమనిస్తూ వాటికి అనుగుణంగా వ్యవస్థలో తగ్గ మార్పులను తీసుకుని వస్తున్నామని  రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదప్ అన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటయ్యే నైపుణ్య కేంద్రంలో ఈ సమాచారం అంతా నిక్షిప్తం చేసి సమర్ధంగా ఉపయోగించడం జరుగుతుందని ఆయన వివరించారు. రైల్ టెల్ తో రైల్వేల అనుబంధం వివిధ రంగాలలో కొనసాగుతుందని ఆయన  అన్నారు. ఈ-ఆఫీస్, వీడియోల ద్వారా నిఘా ఉంచడం, దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో వైఫై సేవలను అందించే సేవా  కార్యక్రమాలను రైల్ టెల్ తో కలసి  రైల్వేశాఖ అమలు చేయనుందని యాదవ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: