ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు మిత్ర పక్షం కాస్త బీజేపీకి సమస్యగా మారిపోతుంది. దీంతో నోటి దాకా వచ్చిన ముద్ద కాస్త చేజారి పోయినట్లుగా మారిపోతుంది బీజేపీ పరిస్థితి. మహారాష్ట్రలో ఎన్నో సంవత్సరాల పాటు మిత్రపక్షంగా ఉన్న శివసేన ఒక్కసారిగా భారీ డిమాండ్లు ముందుకు ఉంచడంతో బీజేపీ అంగీకరించలేదు. ఆ తర్వాత బీజేపీ నుంచి వేరుపడి ఎన్సీపీ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన. బిజెపి పార్టీకి మహారాష్ట్రలో భారీ మెజారిటీ ఓట్లు ఉన్నది శివసేన వేరు పడటంతో అధికారం చేజిక్కించుకోలేకపోయింది బీజేపీ.
ఇక ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో కూడా మహారాష్ట్ర తరహా ఘటనలు జరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ బీజేపీకి షాక్ ఇవ్వబోతున్న అంటే అవుననే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది బీహార్ రాజకీయాల్లో . నితీష్ కుమార్ బీజేపీ నుంచి వేరే పార్టీలతో కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం బీజేపీతో నితీష్ కుమార్ బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి