మొదటి నుంచి చైనా విస్తరణవాద ధోరణితో ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. కనిపించిన భూభాగం అల్లా తమదే అంటూ చెబుతూ అన్ని దేశాలతో వివాదాలకు తెరలేపుతూ  వస్తుంది చైనా.  ఈ క్రమంలోనే టిబెట్ విషయంలో చైనా దారుణంగా వ్యవహరించింది అన్న విషయం తెలిసిందే.  టిబెట్ ప్రజలందరినీ ఏకంగా దేశం నుంచి తరిమేయడం లాంటి ఘటనలు కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. టిబెట్ లో దలైలామా విషయంలో చైనా వ్యవహరించిన తీరు మరింత దారుణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదగాలని అనుకుంటుంది చైనా.



 ఈ క్రమంలోనే చైనాను ఎప్పటికప్పుడు నిలువరించేందుకు అటు  అమెరికా ముందుకు వస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్రంప్  అధికారంలో ఉన్న సమయంలో చైనాపై గుప్పించిన విమర్శలు చేసిన ఆరోపణలు అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే. జో బైడెన్ వచ్చిన తర్వాత చైనాకు  కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అనే టాక్ వినిపించింది. కానీ జో బైడెన్ వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు అన్నది అర్థం అవుతుంది. ఇటీవలే దలైలామా విషయంలో చైనా కు వార్నింగ్ ఇచ్చింది అమెరికా. ప్రస్తుతం ఇది కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది.



 దలైలామాను తరిమికొట్టి  పారిపోయేలా  చేసిన చైనా దలైలామాను ప్రభుత్వమే నియమిస్తుంది అనే విధంగా వ్యవహరిస్తోంది. దలైలామాను ఎంపిక చేసుకునేందుకు టిబెటన్లు పాటించే సంప్రదాయాల మేరకు కాకుండా చైనా ప్రభుత్వం చెప్తున్నట్లుగా దలైలామా ను ఎంపిక చేయాలని ముందుకు సాగుతోంది. దీనిని అమెరికా తీవ్రంగా తప్పు పట్టింది. బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా ఎంపిక చేసే అధికారం చైనాకు లేదు అంటూ తేల్చి చెప్పింది. బౌద్ధ మతస్తులు వారి సంప్రదాయాల ప్రకారం దలైలామా ఎంపిక చేసుకుంటారని... దలైలామాను ఎలా ఎంపిక చేయాలని అని నిర్ణయించే  హక్కు చైనాకు లేదు అంటూ తేల్చి చెప్పింది. ఇలా అమెరికా తరపున చైనా కు వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: