ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆధునికత  వైపు వెళ్తుంది. నేటి తరం యువత టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. నేటి తరంలో కొంతమంది యువత మాత్రం టెక్నాలజీ వెంట కాదు చెడు వ్యసనాలు వెంట పరుగులు పెడుతున్నారూ. ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగినప్పటికి కూడా చెడు అలవాట్లు చివరికి దారుణ స్థితికి తీసుకు వస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చెడు అలవాట్లు కారణంగా మంచి మంచి ఉద్యోగాలు కూడా పోగొట్టుకొని చివరికి రోడ్డున పడే పరిస్థితులు కూడా వస్తున్నాయి. గొప్ప గొప్ప చదువులు చదివి మంచి ఉన్నత స్థానానికి వెళ్లినప్పటికీ చెడు అలవాట్లు  మాత్రం రోడ్డున పడే స్థితికి తీసుకు వస్తున్నాయి.



 ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మంచి చదువులు చదువుకున్నారు.. విదేశాలకు వెళ్ళాడు అక్కడ మంచి ఉద్యోగం సంపాదించాడు.. అంతలోనే చెడు అలవాట్లు అతని దరి చేరాయి. జల్సాలకు అలవాటు పడ్డాడు. గంజాయి కి బానిస గా మారిపోయాడు. దీంతో ఉద్యోగం కూడా ఊడిపోయింది. చివరికి ఒక సంస్థలో డెలివరీ బాయ్ గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ సదరు యువకుడు తీరు మార్చుకోలేదు.  గంజాయిని తరలించడం మొదలు పెట్టాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.




 ఇటీవల హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది.. కెనడాలో ఉన్నత చదువులు చదివిన సికింద్రాబాద్కు చెందిన బాలాజీ సింగ్ అనే  యువకుడు అక్కడే ఫేస్బుక్ లో ఉద్యోగం సాధించాడు. మంచి ఉద్యోగం మంచి వేతనం వస్తున్నప్పటికీ చెడు అలవాట్లు దారి చేరి గంజాయికి బానిస గా మారిపోయాడు. దీంతో కంపెనీ యాజమాన్యం అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి డెలివరీ బాయ్ గా మారిన సదరు యువకుడు ఆతర్వాత గంజాయి విక్రేతలకు  మీడియేటర్ గా మారాడు.  ఇటీవలే అతనిపై నిఘా పెట్టిన పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: