కేంద్ర అధికార పార్టీ బిజెపి ఇప్పుడు బలపడేందుకు సరైన మార్గం గా కనిపిస్తోంది. తెలంగాణలో ఎప్పటి నుంచో పార్టీ ఉన్నా, దాని ప్రభావం అంతంత మాత్రమే అన్నట్లుగా ఉంటూ వచ్చింది. కానీ అనూహ్యంగా ఇక్కడ బలం పుంజుకోవడంతో ఇక వెనుదిరిగి చూడకూడదు అని కృత నిశ్చయంతో ముందుకు వెళుతోంది. ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకుని అయినా బలపడాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. 



2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా పెద్దగా ప్రయోజనం కలగలేదు. 2019 ఎన్నికల్లో ఎన్నికల బరిలోకి వెళ్లి బిజెపి బాగా తగ్గిపోయింది. అయితే తెలంగాణలో బలం పెంచుకోవడం, ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలలో గెలుపొందడం, ఇవన్నీ ఆ పార్టీలో మరింత హుషారు ను కలిగిస్తుంది.ఏదో రకంగా తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను దెబ్బ తీసి అక్కడ బీజేపీ జెండా పాతాలి అనే వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఉపయోగించుకుని ఇక్కడ బిజెపి కి తిరుగు లేకుండా చేయాలి అన్ లక్ష్యంతో బిజెపి ముందుకు వెళ్తోంది.



 ఈ క్రమంలోనే టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నాయకులను బీజేపీ లోకి చేర్చే పనికి శ్రీకారం చుట్టింది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతిని పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలాగే టిఆర్ఎస్ లో ఉన్న కీలక నాయకుడు స్వామి గౌడ్ త్వరలోనే బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. అదీ కాకుండా బలమైన నాయకులు అందరిని చేర్చుకోవడం ద్వారా, బిజెపి ని మరింత బలోపేతం చేయాలనే దిశగా ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: