ఏపీలో 2019 ఎన్నికల తర్వాత మరో ఎన్నిక జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండగా, అవి కరోనా వల్ల వాయిదా పడ్డాయి. అయితే త్వరలోనే తిరుపతి ఉపఎన్నిక జరగనుంది. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కరోనాతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే తిరుపతి ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నిక జగన్ ప్రభుత్వానికి రిఫరెండంగా మారాయి.

జగన్ ప్రభుత్వ పనితీరుకు ఉప ఎన్నిక ఉదాహరణ కానుంది. అలాగే 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీకి ఈ ఉప ఎన్నిక మంచి వేదిక కానుంది. టీడీపీ పుంజుకుంది అనే తెలియజెప్పే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ఉప ఎన్నికలో గెలవాలని టీడీపీ అప్పుడే అభ్యర్ధిగా పనబాక లక్ష్మీని ప్రకటించింది. ఇటు వైసీపీ దుర్గా ప్రసాద్ ఫ్యామిలీకి టిక్కెట్ దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఆ దుర్గా ప్రసాద్ తనయుడు కల్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జగన్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

అలాగే పాదయాత్రలో జగన్ కాలుకు కట్టు కట్టిన డాక్టర్ గురుమూర్తికి తిరుపతి ఎంపీ సీటు ఇస్తున్నారని తెలిసింది. అటు బీజేపీ-జనసేనలు పొత్తులో పోటీ చేయనున్నాయి. అయితే ఏ పార్టీలు పోటీలో ఉన్నా...ప్రధాన పోటీ మాత్రం వైసీపీ-టీడీపీల మధ్య ఉంటుంది. అయితే గెలుపు అధికార వైసీపీకే సులువు దక్కుతుందని అంటున్నారు. ఎందుకంటే అధికారంలో ఉండటం, పైగా తిరుపతి ఆ పార్టీకి కంచుకోటగా ఉంది. మొన్న ఎన్నికల్లో తిరుపతిలో వైసీపీ 2 లక్షల పైనే మెజారిటీతో గెలిచింది.

అటు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి దీని బట్టి చూసుకుంటే వైసీపీ గెలుపు సులువే. కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకిత ఏమన్నా ఉంటే టీడీపీ సంచలనం సృష్టించే అవక్శముంది. అలా కాకపోయినా టీడీపీ గట్టి పోటీ ఇచ్చినా కూడా వైసీపీకి కాస్త ఇబ్బందే.

మరింత సమాచారం తెలుసుకోండి: