తెలుగు చిత్ర పరిశ్రమ లో తాప్సి కి    ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించిన తాప్సీ తన నటనతోనే కాదు తన అందచందాలతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూన్న  సమయం లోనే అటు బాలీవుడ్  వైపు కన్నేసింది ఈ అమ్మడు. అయితే టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి అదృష్టం బాగా కలిసి వచ్చింది.



 బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది తాప్సి.  ఓవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూనే మరోవైపు గ్లామర్ పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఎంతగా నో అలరిస్తుంది తాప్సీ పొన్ను. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ దక్షిణ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేయడం తగ్గించింది తాప్సీ. ఈ క్రమంలోనే దక్షిణాది అభిమానులు అందరూ ఎంతగానో నిరాశలో మునిగిపోయారు. అయితే ఇటీవలి దక్షిణాది పరిశ్రమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ అమ్మడు.



 బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ దక్షిణాది సినిమాల్లో నటించడం తనకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.. దక్షిణాది అభిమానులు తనను  ఆదరించి అభిమానించడం తన అదృష్టంగా భావిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. సాధారణంగా కొంత మంది బాలీవుడ్ లో చేసినప్పుడు దక్షిణాదిలో సినిమాలు చేయడం కష్టమని చెబుతున్నారు కానీ తన వరకు వస్తే మాత్రం అన్ని భాషల్లో సినిమాలు చేసినప్పుడే నటుడిగా పరిణితి పొందేందుకు అవకాశం ఉంటుంది అని తాను  నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. దక్షిణ చిత్ర పరిశ్రమలో కూడా సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ తెలిపింది..

మరింత సమాచారం తెలుసుకోండి: