భారత్ ప్రస్తుతం మునుపెన్నడూ లేనివిధంగా దౌత్య పరం గా ఎంతో వ్యూహాత్మకం గా ముందుకు దూసుకు వెళ్తుంది అని చెప్పడం లో అతి శయోక్తి లేదు అన్న విషయం తెలిసిందే. భారత శత్రు దేశమైనా చైనా ఎలాగైతే భారత చుట్టూ ఉన్న దేశాల ను  ఆర్థిక సహాయం పేరుతో తన వైపుకు తిప్పుకుని చైనాకు శత్రువు దేశాలు గా మారేలా ప్లాన్ చేస్తుందో  ప్రస్తుతం భారత్ ఆర్థిక సహాయం తో కాదు దౌత్యపరమైన వ్యూహాల తో చైనా చుట్టూ ఉన్న దేశాల ను  తమ వైపు తీసుకుంటూ ముందుకు సాగుతుంది భారత్.



 ప్రస్తుతం వివిధ దేశాల నుంచి ఆయుధాలు విక్రయించడమే  కాదు కొన్ని చిన్న చిన్న దేశాలకు భారత్ అభివృద్ధి చేసిన ఆయుధాల ను బహుమతి గా కూడా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలా క్రమ క్రమంగా చైనా చుట్టూ ఉన్న దేశాలతో దౌత్య పరమైన సంబంధాలను మరింత మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతోంది భారత్. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే వియత్నాం తో భారత్  కీలకమైన ఎటువంటి ఒప్పందం కుదుర్చుకుంది. ఐక్యరాజ్యసమితి శాంతి దళాల కోసం ప్రతి దేశం నుంచి కూడా కొంత మంది సైనికులను పంపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.




 అన్ని దేశాల నుంచి సైనికులు ఐక్యరాజ్యసమితి శాంతి దళాలకు వెళ్తూ ఉంటారు. అయితే అలాంటి బృందాలను వియత్నాం నుంచి పంపించాలి అని అనుకున్నప్పటికీ అక్కడ వారికి సరైన ట్రైనింగ్ లేకపోవడంతో పంపించ లేకపోతుంది వియత్నాం. ఈ క్రమంలోనే వియత్నాం కు సంబంధించినటువంటి ఫైలెట్ లకి ట్రైనింగ్ ఇవ్వడానికి భారత్ ఒప్పందం చేసుకుంది. భారత ఎయిర్ ఫోర్స్ పైలట్ లు  వియత్నం పైలెట్ల కి ట్రైనింగ్ ఇప్పించేందుకు  ఒప్పందం జరిగింది. షిప్ బిల్డింగ్లో వియత్నాం సైనికులు భారత సైనికులకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా పరస్పర ఒప్పందం కుదిరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: