జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో గ్రేటర్ పరిధిలోని ఓటర్ల అందరూ కూడా జీహెచ్ఎంసీ ఎన్నిక లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. సరైన అభ్యర్థి ఎన్నుకొని తమ ప్రాంత అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంతో ప్రస్తుతం అన్ని డివిజన్లలో ఉన్న ఓటర్లు అందరూ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు అన్న విషయం తెలిసిందే. ఉదయం ఏడు గంటలనుంచి పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం నుంచి ఎంతో మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు క్యూ కట్టారు.



 ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నిబంధనల మధ్య జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నిక లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి  ఒక ప్రత్యేకమైన కరోనా కిట్  అందించారు అధికారులు. కరోనా కిట్  ధరించి నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు సిబ్బంది ఓటర్లు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరిస్తే పోలింగ్ కేంద్రాలకు అనుమతిస్తున్నారు. అయితే దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిహెచ్ఎంసి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అన్న విషయం తెలిసిందే.




 అయితే కొన్ని నియోజకవర్గాల్లోని డివిజన్లు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో మాత్రం సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ఓటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి నియోజకవర్గం లోని గౌతంనగర్ 141 డివిజన్ పరిధిలోని ఉన్న కొన్ని పోలింగ్ బూతులలో ... సిబ్బంది కరోనా  నిబంధనలను సరిగ్గా పాటించడం లేదు అంటూ ఓటర్లు  ఆరోపిస్తున్నారు  చర్చనీయాంశంగా మారింది.  అంతే కాకుండా కొన్ని పోలింగ్ బూత్లలో కనీసం శానిటైజర్ కూడా ఏర్పాటు చేయడం లేదు అని ప్రస్తుతం ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే కొన్ని కొన్ని పోలింగ్ బూతుల మినహా మిగతా అన్ని పోలింగ్ బూత్లలో ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: