ప్రస్తుతం మనుషుల ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. చిన్నచిన్న కారణాలకే ఉన్మాదులు గా మారిపోతున్న మనుషులు ఏకంగా సాటి మనుషుల ప్రాణాలు దారుణంగా తీసేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. మనుషుల ప్రాణాలు తీస్తే కఠిన శిక్షలు పడతాయని... చివరికి జైలు పాలు కావాల్సి వస్తుంది అనే భయం ఎవరిలో కనిపించడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక రోజు రోజుకు చిన్న చిన్న కారణాలకే ఏకంగా ఉన్మాదులు గా మారిపోతున్న మనుషులు మానవత్వాన్ని మరిచి దారుణంగా సాటి మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు రోజురోజుకీ తెరమీదికి వస్తూ అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి.


 రోజురోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఎవరిని కదిలిస్తే ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని భయాందోళన లోనే బతుకు ను వెళ్ళదీయాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది ఇలా సాటి మనిషి ప్రాణాలను కిరాతకంగా తీసేస్తూ చివరికి జైలుపాలు అవుతున్నారు ఇక ఇటీవల ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. చీటీ డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం ఏకంగా ఒకరిపై ఒకరు దారుణంగా దాడి చేసుకుని హత్య  యత్నం చేసేంతవరకు దారితీసింది తూర్పుగోదావరి జిల్లాలో.



 తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెల లో చీటీల డబ్బు వివాదం గా మారిపోయింది. చీటీ ల డబ్బులు అడిగారు అన్న కారణంతో ఏకంగా వాలంటీర్ కత్తితో అన్నదమ్ముల పై దారుణంగా దాడికి పాల్పడ్డాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి వచ్చిన వాలంటీర్ అన్నదమ్ముల పై విచక్షణ రహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ముగ్గురు అన్నదమ్ములు తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కత్తితో దాడి చేసిన వాలంటీర్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: