వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన ముంబై లో చోటు చేసుకుంది..నగరంలోని వోర్లీ ఏరియాలో నివాసముంటున్న బ్యాంకు ఉద్యోగి సుశీల్ కుమార్ ఫ్రెండ్‌ని కలిసేందుకు గత శనివారం విరార్ వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటికెళ్లాడు. మూడు రోజులైనా తిరిగిరాకపోవడంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నేరల్ రైల్వే స్టేషన్ పరిధిలో మురుగుకాల్వ లో యువకుడి శవం బయటపడింది. కనిపించకుండా పోయిన అతని శవంగా పోలీసులు గుర్తించారు..
సీసీ టీవీ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. సుశీల్ మద్యం మత్తులో నాడార్ భార్యపై నోరుజారాడు. ఆమెను అసభ్యంగా నానాబూతులు తిట్టాడు. తన భార్యను తిట్టడంతో నాడార్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.మద్యం మత్తులో ఉన్న సుశీల్‌ని నాడార్ దారుణంగా చంపేశాడు. అనంతరం అతని శవాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతో బ్యాగ్‌లో పెట్టుకుని నేరల్ సమీపంలోని మురుగుకాల్వలో పడేశాడు.. దగ్గరలోని కెమెరాల కారణంగా అడ్డంగా దొరికిపోయాడు.. భార్యని తిట్టాడని ఫ్రెండ్‌ని చంపేసినట్లు నాడార్ ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి