హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రాంతం వారు ఎక్కువగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఆంధ్ర ప్రాంతం వారికి సంక్రాంతి అతి పెద్ద పండుగ. అందుకే.. టీఎస్‌ఆర్టీసీ సంక్రాంతి కోసం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోని అనేక ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈనెల 8 నుండి 14వరకు టీఎస్ఆర్టీసీ  ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించింది. టి.యస్.ఆర్.టి.సి., హైదరాబాద్ నుండి ఇరు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు 4981 ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

ఈ బస్సులు జంట నగరాల నుండి తెలంగాణా- ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు నడుపుతుంది.మహాత్మా గాంధి బస్ స్టేషన్ , జూబ్లీ బస్ స్టేషస్ , సి.బి.ఎస్ , ఉప్పల్ క్రాస్ రోడ్ , యల్.బి.నగర్ , లింగంపల్లి , చందానగర్ , ఇ.సి.ఐ.యల్ , కె.పి.హెచ్.బి , యస్.ఆర్.నగర్ , అమీర్ పేట , టెలిఫోన్ భవన్ , దిల్ సుఖ్ నగర్ తో పాటు జంట నగరాలలోని వివిద శివారు కాలనీలలో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమయిన పాయింట్ల నుండి, అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద నుండి కూడా ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ , విజయనగరం , తెనాలి , గుంటూర్ , గుడివాడ , రాజమండ్రి , కాకినాడ , రాజోలు , పోలవరం , మచిలీపట్నం , ఏలూరు , తాడేపల్లిగూడెం , తణుకు , విశాఖపట్నం , శ్రీకాకుళము , భీమవరం , నర్సాపురం , కర్నూల్ , అనంతపురం , కడప , చిత్తూరు , ఒంగోలు , నెల్లూరు , తిరుపతి , ఉదయగిరి , కనిగిరి , కందుకూరు , పామూరు , పొదిలి తదితర ప్రాంతాలకు కూడా దసరా ప్రత్యేక బస్సులను నగరములోని వివిధ పాయింట్ల నుంచి నడుపుతుంది.

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులను నగరములోని బిహెచ్ఈఎల్ , మియాపూర్ , కె.పి.హెచ్.బి , దిల్ షుక్ నగర్ , ఇ.సి.ఐ.యల్ , యల్.బి.నగర్, ఆరాంఘర్ పాయింట్ల నుండి తేదీ 8 నుండి 14వ తేదీ వరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిద ప్రాంతాలకు నడుపుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 1,600 బస్ లు తెలంగాణ ఆర్టీసీ నడిపిస్తోంది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సులు అడ్వాన్స్ రిజర్వేషన్  www.tsrtconline.in వెబ్‌ సైట్‌లో  బుక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: