అయితే తమ కస్టమర్లకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే అన్ని రకాల సర్వీసులను అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న మెరుగైన సర్వీసుల ద్వారా మిగతా బ్యాంకుల కంటే స్టేట్ బ్యాంక్ కస్టమర్లు ఎంతగానో లబ్ది పొందుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల సంఖ్య రోజురోజుకూ పెంచుకుంటూ దూసుకుపోతుంది. మిగతా ఏ బ్యాంకులకు అందనంత దూరంలో ఎక్కువమంది కస్టమర్లను కలిగి ఉన్న బ్యాంకుగా కొనసాగుతోంది ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అయితే ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు సంఖ్యను తెలియ జేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల సంఖ్య అమెరికా దేశం యొక్క జనాభా కంటే ఎక్కువ అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2019- 20 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం.. 2020 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల సంఖ్య 44.89 కోట్లు కాగా.. 2020లో అమెరికా జనాభా 33.2 కోట్లు అంటూ తెలిపింది. అంతేకాకుండా ఎస్బిఐ కి దేశవ్యాప్తంగా 22141 బ్రాంచీలు ఉన్నట్లు తెలిపింది. ఇటీవలే రిలయన్స్ జియో కూడా ఇలాంటి తరహా ప్రకటనలు చేసింది అనే విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి