ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగిపోవడం ఏమో కానీ ఎంతో మంది విద్యార్థులు చెడు దారులు పడుతున్నారు అన్న విషయం తెలిసిందే. తెలిసీ తెలియని వయసులోనే చెడు దారుల వైపు నడుస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఎంతోమంది విద్యార్థులు. ఇక్కడ విద్యార్థులు తీసుకున్న నిర్ణయం అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. పెళ్లి చేసుకుని దంపతులుగా కలిసి బతకాలని కోరిక తో ఇద్దరు స్కూల్ విద్యార్థులు ఎవరికీ చెప్పకుండా లేచిపోయారు. గుజరాత్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. వడోదర ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. ఇక ఇద్దరు తరగతి గదిలో ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. అయితే లాక్ డౌన్ కారణంగా స్కూల్స్ మూతపడడంతో.. వాళ్లు కలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఒకరిని విడిచి ఒకరుఉండలేమని ఇక పెళ్లి చేసుకుని దంపతులుగా జీవించాలని అనుకున్నారు విద్యార్థులు. ఈ క్రమంలోనే ఇంట్లో వాళ్లకి చెప్పకుండా పారిపోవాలని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం డిసెంబర్ 28వ తేదీన ఇంట్లో చెప్పకుండా బయటికి వచ్చేశారు.
ఈ క్రమంలోనే బాలుడు 25000 బాలిక 5000 తమ వెంట తెచ్చుకున్నారు. కాగా వాపి ప్రాంతంలో 500 రూపాయలకు ఒక గది అద్దెకి తీసుకుని ఉండటమే కాదు ఖర్చుల కోసం ఒక వస్త్ర దుకాణంలో పని కూడా చేరాడు బాలుడు. అయితే బాలుడు బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాగోలా వారి ఆచూకి కనుగొన్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే తమ మధ్య శారీరక సంబంధం కూడా ఉంది అని బాలిక చెప్పడంతో బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడిని క్వారంటైన్ లో ఉంచారు పోలీసులు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి