జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటినుంచి సీఎం జగన్ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి అని ఎన్నో మాటలు చెబుతున్నారు అధికార పార్టీ నేతలు. కానీ వాస్తవానికి వస్తే మాత్రం జగన్ సర్కార్ మాట తప్పడం మడమ తిప్పడం లాంటివి  అన్ని చేస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా నిరుద్యోగుల  విషయంలో ఇచ్చిన మాట తప్పి  చివరి  నిరుద్యోగులకు ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిరుద్యోగులు అందరూ మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు జగన్ గారు.. అని  వేడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయం వాలంటరీ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి జగన్ సర్కారు చేతులు దులుపుకుంది.



 కానీ వాస్తవంగా చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయం గురించి ఇప్పటి వరకు జగన్ సర్కారు ఊసే ఎత్తలేదు అన్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ప్రతి సంవత్సరం జనవరి నెలలో ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ కి సంబంధించిన క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఉద్యోగాలు వస్తాయి అని ఎంతో మంది నిరుద్యోగులు ఎంతో ఆనంద పడిపోయారు. ఈ క్రమంలోనే ఇక ఓటు వేసి జగన్ ను గెలిపించారు.



కానీ  అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి.. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన విషయం మర్చిపోయారు మాట తప్పని సీఎం జగన్ . జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం హామీ ఇవ్వగా ఇపుడు చూస్తే.. సీఎం జగన్ మూడు సంవత్సరాల పాలన కొనసాగించినప్పటికీ.. ఉద్యోగాల భర్తీ చేపట్టక నిరుద్యోగుల ఆశలు తుంగలోతొక్కింది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే ఎంతో ఆవేదన చెందిన  నిరుద్యోగులు జగన్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: