ప్రత్యేకించి సీఎస్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఆయన్ను పట్టించుకోవడం లేదు. నిన్న మీటింగ్ ఉందని రమ్మని పిలిస్తే.. డుమ్మా కొట్టేశారు. నిమ్మగడ్డ మెమో ఇచ్చినా లైట్ గా తీసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం వేళ వెళ్లి ఓ నోట్ ఇచ్చేసి వచ్చారు. సాయంత్రం 4 గంటలు దాటినా ద్వివేది, గిరిజాశంకర్ రాకపోవడంతో రమేశ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు గంటల్లోగా రావాలని, అదే చివరి అవకాశమని గిరిజా శంకర్‌కు మెమో జారీ చేశారు. వారిద్దరూ ఎస్‌ఈసీ కార్యాలయానికి వెళుతున్నట్టు సాయంత్రం 5.30 గంటలకు మీడియాకి సమాచారం వచ్చింది. కానీ వారు నేరుగా సీఎస్ దగ్గరకు వెళ్లారు. ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటిస్తూ లేఖ సిద్ధం చేశారు.
ద్వివేది, గిరిజాశంకర్ ఆ లేఖను తీసుకుని రాత్రి 8 గంటల సమయంలో ఎస్‌ఈసీ కార్యాలయానికి వెళ్లి అందజేశారు. మీడియా ప్రతినిధుల కంటపడకుండా వేరే మార్గంలో తిరిగి వెళ్లారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని విభాగాల సిబ్బందికీ కరోనా వ్యాక్సిన్ వేసిన తర్వాత, 60 రోజులు దాటాకే ఎన్నికలు నిర్వహించాలని అప్పటి వరకు వాయిదా వేయాలని ఎస్‌ఈసీని లేఖలో కోరారు. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేమని, ఎస్‌ఈసీ ఆదేశించినట్టుగా అధికారులపైనా చర్యలు తీసుకోలేమని తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేవరకు ఎన్నికలపై ముందుకెళ్లొద్దనీ విజ్ఞప్తి చేశారు.
ఓవరాల్ గా చూస్తే.. ఎన్నికల నిర్వహణ కోసం ఎస్‌ఈసీ ప్రభుత్వాన్ని కోరిన ఏ చర్యలకూ సీఎస్ సానుకూలంగా స్పందించలేదు. అయితే ఇలా అధికారులు ఎస్‌ఈసీ మాటవినకపోవడం వల్లే ఇబ్బందులు తప్పవని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అంటున్నారు. క్రమశిక్షణ చర్యల విషయంలో ఎస్‌ఈసీ, సీఈసీకి సమాన అధికారాలంటాయని.. టి.ఎన్.శేషన్ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు సుప్రీం తీర్పు ఇచ్చిందని.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపైనా క్రమశిక్షణ చర్యలకు ఆదేశించొచ్చని..
ఈసీకి సహకరించని అధికారులు వ్యక్తిగతంగా ఇబ్బందులు పడక తప్పదని ఐవైఆర్ అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి