సాధారణంగా ప్రస్తుతం కరోనా  వైరస్ కష్టకాలంలో డాక్టర్లు ప్రత్యక్ష దైవాలుగా మారిపోయారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంతో మంది డాక్టర్లు తమ కుటుంబాలను వదిలేసి ప్రజల ప్రాణాలు రక్షించడానికి విధి  నిర్వహణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందించారు.  ఎంతో మంది డాక్టర్లు కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా తెరమీదికి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయిన నేపథ్యంలో కొన్ని కొన్ని సార్లు ఏకంగా ఆస్పత్రిలో బెడ్లు  కూడా సరిపోని పరిస్థితి ఏర్పడిన ఘటనలు కూడా ఎన్నో తెరమీదకు వచ్చాయి.


 అయితే ఇలా ఆసుపత్రిలో బెడ్లు సరి పోనప్పుడు బాధితులు ఏదో ఒక విధంగా పేషెంట్లకు సదుపాయం  ఏర్పాటు చేసి వైద్యం అందిస్తూ వుంటారు. లేదా వేరే ఆస్పత్రికి పంపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఒక వైద్యుడు చేసిన పని మాత్రం ప్రస్తుతం  సంచలనం గా మారిపోయింది. ఇక్కడ ఒక వైద్యుడు పనిచేస్తున్న ఆస్పత్రికి ఒక కరోనా పేషెంట్ వచ్చాడు. ఈ క్రమంలోనే బెడ్లు  ఖాళీ లేకపోవడంతో ఇక ఆ డాక్టర్ ఆ పేషెంట్ ను మరొక ఆస్పత్రికి పంపించకుండా ఏకంగా పైలోకాలకు పంపించాడు.  బెడ్లు ఖాళీ లేవు అనే కారణంతో దారుణంగా  హత్య చేశాడు. ఇటలీలో వెలుగులోకి వచ్చింది.



 అయితే ఇది ఇప్పుడు జరిగింది  కాదు కరోనా పీక్ స్టేజిలో ఉండి ఎక్కువ కేసులు నమోదు అవుతున్న సమయంలో జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆసుపత్రిలో కరోనా ఎమర్జెన్సీ వార్డుకు ఇన్చార్జిగా  వ్యవహరిస్తున్నాడు కార్లో మోస్కా . ఈ క్రమంలోనే కరోనా కేసులు పెరిగి ఇక పేషెంట్ల తో ఆసుపత్రులలో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బెడ్లు  అన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలోనే కొంతమందిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు డాక్టర్. ఈ క్రమంలోనే ఇద్దరు వృద్ధులను టార్గెట్గా చేసుకుని వారికి పలు రకాల మందులు ఇచ్చి చివరకు ప్రాణాలు కోల్పోయేలా  చేశాడు సదరు డాక్టర్. అయితే ఆ తర్వాత ఈ విషయాన్ని సెల్ ఫోన్ లో చాటింగ్ చేయడం తో అసలు ఉదంతం వెలుగులోకి వచ్చి సంచలన గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: