ఇక అవసరం లేకపోయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మొబైల్లోనే కాలం గడుపుతున్నారు. పక్కన మనుషులు ఉన్నా లేక పోయినప్పటికీ మొబైల్ చేతిలో ఉంటే చాలు ఇక ఎక్కడ ఉన్నా తమ చుట్టూ ఎంతో మంది మనుషులు ఉన్నారు అని ఫీల్ అవుతున్నారు నేటి రోజులలో జనాలు. అయితే.. పగలంతా మొబైల్ వాడకం ఒక ఎత్తు అయితే ఇక రాత్రి సమయంలో కూడా చార్జింగ్ పెట్టి తమ పక్కనే మొబైల్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఛార్జింగ్ పెట్టిన తర్వాత పక్కనే మొబైల్ పెట్టుకోవడం ఎంతో ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.
ఇలా పరిమితికి మించి చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ పూర్తిగా పనికిరాకుండా మారిపోయే అవకాశం కూడా ఉందని తద్వారా ప్రాణాల మీదికి వచ్చే అవకాశం కూడా ఉంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు అయితే ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ కొన్నవారికి మాత్రం అలాంటి అపాయం లేదు అని అంటున్నారు. ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ఫోన్లలో మొబైల్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత పూర్తిగా చార్జింగ్ అయినాక ఆటోమేటిక్గా ఛార్జింగ్ ప్రక్రియ నిలిచిపోయేలా ఒక సాఫ్ట్వేర్ అమర్చుతున్నారని నిపుణులు అంటున్నారు. అయితే పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించిన మొబైల్ ఫోన్ లే చార్జింగ్ సమయంలో పేలినప్పుడు ఇక మిగతా కంపెనీల ఫోన్లు పేలవు అనే గ్యారంటీ లేదని అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం ఎంతో మంచిది అని సూచిస్తున్నారు మరికొంతమంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి