అదే సందర్భంలో ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ మాట తప్పను అంటూ, ప్రస్తుతం ఎవరైనా తిరిగి వస్తే చేర్చుకునేది లేదంటూనే... ఒకవేళ రావాలనుకుంటే రాజీనామా చేసి రావాలన్న పద్ధతిని పెట్టి.. ఇంకో వైపున పరోక్షంగా వాళ్లని రాజీనామా చేయకుండా ఇటు పార్టీలో చేర నీయకుండా.. పార్టీ తరఫున పని చేసేలా యాక్టివిటీస్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు సాయి. స్వతంత్రులు అన్నటువంటి పేరుతో.. అటు యాక్షన్ తీసుకోరు, అటు ఇటు కానటువంటి రాజకీయం కిందకు తీసుకు వచ్చారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో అది కాస్తా నెగిటివ్ అవుతుందని భావించారో ఏమో కానీ.. తాజాగా వాళ్ళని అక్కడ లోకల్ గా నెక్స్ట్ ట్రిప్ వాళ్లే పోటీ పడతారు అన్న విషయం మాత్రం క్లారిటీ ఇస్తున్నారు అని తెలిపారు.
ప్రధానంగా గన్నవరం వల్లభనేని వంశీ తెలుగు దేశం నుండి వైసీపీలోకి రాకుండానే వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. అలాంటి సందర్భంలో అక్కడ గతంలో పోటీచేసిన వెంకటరావు కి కేవైసీ చైర్మన్ ఇచ్చారు.
ఆయన పనులు చేస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వీరిద్దరికి షేక్ హ్యాండ్ ఇప్పించి నెక్స్ట్ వంశీనే పోటీ చేస్తారు అన్న క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ లోకల్ గా వీళ్లిద్దరు కొట్లాడుకుంటున్న సందర్భంలో ఇప్పుడు వారిద్దరిలో ఏ అభ్యర్థిని ఫైనల్ చేయాలి అన్నటువంటి చర్చ మొదలైంది. దాంతో మళ్లీ మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉండడంతో అధిష్టానం నుండి వంశీకి అనుకూల ప్రకటన లభించడం విశేషం అన్నారు సాయి.
వంశీకే పూర్తి పగ్గాలు అప్పచెబుతున్నట్లు ప్రకటించారు ఏపీ అధికారపార్టీ వాళ్లు. దాంతో నియోజకవర్గం మొత్తం వంశీ చేతికి చేరినట్లు అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుత చర్చ ఏమిటంటే.. అయితే కాస్త చిన్నబుచ్చుకున్న వెంకట్రావు ఇప్పుడు పార్టీలో ఉంటారా లేక టీడీపీలో చేరుతారా అన్న అంశం ఆసక్తికరంగా మారింది అన్నారు. ఇక్కడ ఈయనకు టిడిపి టికెట్ దక్కుతుందా లేదా అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పటికే దానిపై చాలా మంది ఆశలు పెట్టుకొని ఉన్నారు. దేవినేని ఉమా దగ్గర నుండి అనేక నాయకులకు ఆ ఆశ ఉన్నట్లు పేర్కొన్నారు సాయి. అయితే టీడీపీకి ఎంతో ముఖ్యమైన గన్నవరంలో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయో తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి