ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకీ ఊపందుకుంటోంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు వాడివేడిగా జరుగుతూ ఉండగా ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆంధ్ర రాజకీయాలు మరింత హాట్ హాట్ గా మారిపోయాయి. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా ఇక వచ్చే నెల 14వ తేదీన ఎన్నికల కు సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే గతంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఒకటి.. ప్రస్తుతం జరుగుతున్నది ఒకటి అని అంటున్నారు విశ్లేషకులు.



 ఇంతకీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏమనుకున్నారు అని అంటారా..  తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎన్నికలు నిర్వహించాలి అని మొదట్లో ఎన్నికలు వాయిదా పడక ముందు సీఎం జగన్ అనుకున్నారు. కానీ ఆ సమయంలో చివరికి ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేయడం సంచలనంగా మారిపోయింది. అయితే ఇటీవలే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా వచ్చేనెల 10వ తేదీన ఎన్నికలు..  14వ తేదీన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది.  ఇది వినడానికి చెప్పుకోవడానికి బాగానే ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల మాత్రం ఖర్చు తడిసి మోపెడు అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.



 ప్రస్తుతం ఎక్కువ సమయం ఉండడంతో ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేపట్టి తమ బలం ఎంత ఉంది అని చాటుకునేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారూ. ఈ క్రమంలో ఎక్కువ మంది కార్యకర్తలను తమ ర్యాలీలు ప్రచారంలో కూడా పెట్టుకుంటారు.  ఇలా ఆయా పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏకంగా వందల మంది కార్యకర్తలు తమ వెంట పెట్టుకోవడం వల్ల ప్రతి రోజూ లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఎక్కువ సమయం కూడా వృధా అవుతుంది అని అంటున్నారు.  ఇలా మున్సిపల్ ఎన్నికలను శరవేగంగా నిర్వహించి తక్కువ ఖర్చు తక్కువ సమయం వెచ్చించాలని జగన్ భావించినప్పటికీ ఇక ఇప్పుడు మరోలా జరుగుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: