ఇప్పుడు చాలా మంది ఎక్కువగా ఇంట్లోనే ఉండి ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారు. అయితే ఓ వ్యక్తి కూడా చల్ల చల్లగా కూల్ డ్రింక్ తాగుదామని అనుకుని ఒక కూల్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే అతనికి ఆ ఫుడ్‌ డెలివరీ కంపెనీ కూల్ డ్రింక్ కు బదులుగా యూరిన్ నింపిన బాటిల్ పంపారట.  ఈ దారుణ ఘటన యూకేలో చోటు చేసుకుంది. అసలు వివరాలలోకి వెళితే ఒలీవర్‌ మెక్‌మానస్‌ లాక్‌డౌన్‌లో భోజనం ఆర్డర్‌ చేశాడు. అందులో కూల్‌డ్రింక్‌ కూడా ఉంది.

అయితే ఆర్డర్‌ అయితే ఇంటికి వచ్చింది. కానీ కూల్ డ్రింక్ బాటిల్ లో  ఉన్నది ఏదో తేడాగా కనిపించింది. అసలు ఏంటి ఇలా ఉంది అని ఆరాగా చూడగా అప్పుడు అర్ధం అయింది  అది మనిషి యూరిన్‌ అని. ఇంకేముంది ఆగ్రహముతో ఊగిపోయాడు. యూరిన్‌ నింపిన కూల్‌డ్రింక్‌ బాటిల్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ దాన్ని పంపిన హెల్లో ఫ్రెష్‌ యూకే కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు.మీ అడ్రస్‌ చెప్తే దీన్ని మీకు పంపిస్తానని కామెంట్ కూడా  రాసుకొచ్చాడు. ఇంకేముందీ అతడి మెసేజ్ కాస్త వైరల్‌గా మారింది. ఇది చుసిన నెటిజన్లు అసలు  ఏం జరిగిందో వివరించి చెప్పండి అంటూ తిరిగి కామెంట్స్ పెట్టారు.

దీంతో అతనికి తిక్క రేగి మెసేజ్  డిలీట్‌ చేశాడు.కానీ ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ హలో ఫ్రెష్‌ కంపెనీ వారికీ చేరింది. దానితో వారు అతనికి క్షమాపణలు చెప్పారు . అసలు ఆ  బాటిల్‌కు ఆ కంపెనీకి అసలు ఎలాంటి సంబంధమే లేదట. అయితే డెలివరీ బాయ్‌ చేసిన తప్పిదం వల్లనే  ఇలా జరిగిందని అంటున్నారు. మూత్ర విసర్జన చేసే సమయం లేకపోవడంతో బాటిల్‌లోనే నింపేసి, ఆ విషయాన్నీ  మర్చిపోయి ఆ బాటిల్‌ను నేరుగా కస్టమర్‌కు డెలివరీ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: