ఇకపోతే ఈ మధ్య కాలంలో అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ మందుబాబులకు భారీ జరిమానాలు విధిస్తున్నారు. అంతేకాకుండా మరోసారి మద్యం తాగి వాహనం నడపకుండ కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపడం లేదు కానీ ఇప్పటికీ కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడమే కాదు ఏకంగా తనిఖీలు చేస్తున్న పోలీసులపై కూడా వాహనం తో దూసుకుపోతున్న ఘటనలు ఎన్నో తన మీదకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇటీవలే ఓ మందు బాబు చేసిన పనికి ఏకంగా ట్రాఫిక్ ఎస్ఐ గాయాలపాలయ్యాడు. కేపీహెచ్బీ లో అర్ధరాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే సాయి కుమార్ అనే వ్యక్తి బుల్లెట్ బైక్ పై అటువైపుగా వచ్చాడు. అయితే ముందు భారీ గేట్లు పోలీసులు ఉన్నారు అని గ్రహించి ఎక్కడ బైక్ ఆపకుండా ఎంతో వేగంగా దూసుకొచ్చాడు. ఈ క్రమంలోనే బారికేడ్లు చెల్లాచెదురు అయిపోవడంతో పాటు.. ఎస్సై కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే గాయాలు అయిన ఎస్ఐని ఆస్పత్రికి తరలిస్తుండగా సాయి కుమార్ అనే వ్యక్తి తప్పించుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి