పుర పాలక ఎన్నికల రణభేరి రాష్ట్రంలో మోగింది.. ఎవరికీ వారే అన్నట్లు బరిలో దిగిన నేతలు బిజీగా ఉన్నారు. కడప జిల్లాలో ఎన్నికల వేడి కాస్త ఎక్కువగానే ఉంది.జిల్లాలో మొత్తం ఎనిమిది పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతుండగా.. పులివెందుల, రాయచోటి సంఘాలతోపాటు ఎర్రగుంట్ల నగరపంచాయతీలో సగం కంటే ఎక్కువ వార్డుల్లో తమ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపిక కావడంతో ఆయా చోట్ల ఛైర్మన్‌ పదవులు వైకాపాకే దక్కనున్నాయి. పులివెందులలో మొత్తం 33 వార్డులు, రాయచోటిలో మొత్తం 34 వార్డులకు 31, ఎర్రగుంట్లలో 20 వార్డులకు 13 చోట్ల వైకాపా కౌన్సిలర్‌ అభ్యర్థులు మాత్రమే బరిలో నిలవడంతో వారు విజయం సాధించినట్లుగా అధికారులు ప్రకటించారు.


ఇకపోతే ఇవి కాక మిగిలిన చోట్ల ఛైర్మెన్ పదవి దక్కించుకోవడానికి టీడీపీ, వైసీపీ లు గట్టి పోటీని ఇస్తున్నారు. ఎవరికీ వారే అన్నట్లు దూకుడును ప్రదర్శిస్తున్నారు.మేయర్, ఛైర్మన్‌ అభ్యర్థులు తమ వార్డులకే పరిమితం కాకుండా ఇతర చోట్ల కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొందరైతే అవసరమైన కార్పొరేటర్, కౌన్సిలర్‌ అభ్యర్థులకు డబ్బులు కూడా  ఇస్తున్నట్లు సమాచారం. అయితే కడప నగరంలో మాత్రం అధికార పార్టీ పాగా వేసినట్లు తెలుస్తోంది.


వైకాపా తరఫున మాజీ మేయరు కొత్తమద్ది సురేష్‌బాబు రెండోసారి అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. ఈయన ప్రస్తుతం 4వ డివిజన్‌ కార్పొరేటరుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక మొదటగా చిన్నచౌకు సర్పంచిగా గెలుపొందిన సురేష్‌బాబు, అనంతరం జిల్లా పరిషత్తు అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన భార్య జయశ్రీ గతంలో కడపలో కార్పొరేటరుగా గెలిచారు. అనంతరం ఈయన వరుసగా రెండుసార్లు పోటీచేసి కార్పొరేటరుగా విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో మేయర్‌ పదవిని బీసీకి రిజర్వేషన్‌ చేయడంతో సురేష్‌బాబుని నిలబెట్టడానికి వైకాపా పెద్ద తలలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది టీడీపీ అభ్యర్థి రషీదాను ను మేయర్ గా ప్రకటించారు. కాగా, ఇప్పుడు టీడీపీకి కడపలో అంత సీన్ లేదని తేలడంతో కడప పీఠం సురేష్ బాబుకే దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో మార్చి 14 న తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: