వీటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశం తో ట్రాన్స్ జెండర్ హెల్ప్‌డెస్క్‌ను అందుబాటు లోకి తెస్తున్నారు. హిజ్రాల్లో కొంత మందినైనా మార్చగలిగితే నేరాలు నియంత్రణ లోకి వస్తాయని సైబరాబాద్ పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ' ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్'ను పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించనున్నారు.. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో తరచూ జరుగుతున్న ఘర్షణలు, రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడం తో పాటు హిజ్రాలను ఎవరైనా వేధించిన సందర్భంలో పోలీసుల నుంచి సహాయం కోసం ఈ హెల్ప్‌డెస్క్ మార్గదర్శనం చేయనుంది.
ఇకపోతే నేరాలను అరకట్టేందుకు పోలీసులు మరో సువర్ణావకాశం అందించారు. హైదరాబాద్‌లో దాదాపు ఎనిమిదివేల మంది వరకు హిజ్రాలు ఉన్నారు. వీరిలో బాగా చదువుకున్న వాళ్లూ ఉన్నారు. విద్యావంతులైన వారు కొందరు వారికి ఆసక్తి ఉన్న రంగంలో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే హిజ్రాలకున్న సమస్యలను పరిష్కరించడం తో పాటు వారిలో బాగా చదువుకున్నవారికి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎస్‌సీఎస్‌సీ చేయూత తో 'హెల్ప్‌డెస్క్' పనిచేయనుంది. కాగా, ఈ విషయం తెలుసుకున్న పలు ఐటీ కంపెనీలు వీరికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి