ప్రస్తుతం దేశంలోని ప్రతి గ్రామంలో కూడా గర్భిణీ మహిళలు చిన్న పిల్లలకు  పౌష్టికాహారాన్ని అందుకోగలుగుతున్నారు అన్న విషయం తెలిసిందే. కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ..  గర్భిణీలు చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందేవిధంగా ఎంతగానో నిధులు కేటాయిస్తుంది. ప్రస్తుతం ప్రతీ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే స్థానికంగా పౌష్టికాహారం అందుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు కేటాయిస్తూ ఉన్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తామె ఈ పథకాలను అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చుకొంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.



 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాగే కొనసాగుతుంది.  కేంద్ర ప్రభుత్వ పథకానికి జగనన్న అనే పేరును పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో చంద్రన్న అనే పేరు ఉండేది ఇప్పుడు జగనన్న అని  ఉన్నప్పటికీ కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అటు రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతుంది అన్నది మాత్రం తెలుస్తుంది. గర్భిణీలకు చిన్న పిల్లలకు పౌష్టికాహారం కోసం  శిశు సంక్షేమ శాఖ నిధులు కేటాయించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పౌష్టికాహారం స్థానికంగా అందడం లేదు అన్నది అర్ధమవుతుంది.



 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఇలాగే జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ  క్రమంలోనే ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి ఇటీవలే ఏకంగా జగన్ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ విమర్శలు చేయటం  సంచలనంగా మారిపోయింది. గర్భిణీ మహిళలకు ఇచ్చేటువంటి ఎండు ఖర్జూరాలు కుళ్లిపోయి ఉండడం.. నాసిరకం ఆహారపదార్థాలు అందిస్తూ ఉండడం... తినలేనటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉండటం .. లాంటివి జరుగుతున్నాయని పరిశీలించిన తమ్మినేని సీతారాం సతీమణి నాసిరకం గుడ్లు, నీల్లలాగా ఉండే సాంబార్ సహా మిగతా అన్ని కూడా నాసిరకంగా ఉన్నాయి అంటూ ఏకంగా విమర్శలు గుప్పించారు తమ్మినేని సీతారాం సతీమణి. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  ఇది కాస్త ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: