కానీ ఎప్పుడూ కూడా సంతోషం కోసం పరితపిస్తూ ఉంటాడు మనిషి. ఇక తాము ఎంతో సంతోషంగా ఉన్నాము అని కొంతమంది అనుకుంటూ జీవిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలలో ఏ దేశంలోనూ ప్రజలు ఎక్కువగా సంతోషంగా ఉన్నారు అన్న విషయం పై ఇటీవల ఐక్యరాజ్యసమితి ఒక సర్వే నిర్వహించగా ఇందులో అగ్రరాజ్యాలు కూడా చోటు దక్కించుకోలేకపోయాయి అని చెప్పాలి. ఒక చిన్న దేశం ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో నిలిచింది.
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలు ఏవి అనే దానిపై సర్వే నిర్వహించగా ఫిన్లాండ్ దేశం మొదటి స్థానంలో నిలిచింది. 149 దేశాలలోని ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత ఐక్యరాజ్యసమితి ఈ నివేదిక వెల్లడించడం గమనార్హం. అగ్ర రాజ్యాలైన అమెరికా, జపాన్ లాంటి దేశాల కంటే ఫిన్లాండ్ దేశంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నట్లు అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫిన్లాండ్ దేశం తర్వాత డెన్మార్క్ స్విజర్లాండ్ ఐస్లాండ్ నెదర్లాండ్స్ ఉన్నాయి. సామాజిక అంశాలు జిడిపి వ్యక్తిగత స్వేచ్ఛ ఆధారంగా ఈ నివేదికను వెల్లడించింది ఐక్యరాజ్యసమితికి అత్యంత సంతోషంగా లేని దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి