రాష్ట్రంలో ఆర్య వైశ్య కార్పొరేష‌న్ ప‌రిస్థితి ఏంటి? ఏడాది ముగుస్తున్నా.. దీని తాలూకు ఫ‌లాలు.. పేద వైశ్య సామాజిక వ‌ర్గానికి చేరుతున్నాయా?  లెక్క‌లు చెప్పేవారు ఉన్నారా ? ఇదీ.. ఇప్పుడు ఆర్య వైశ్య సామాజిక వ‌ర్గంలో చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశాలు. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వివిద కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసినా.. ఆర్యవైశ్య సామాజిక వ‌ర్గానికి మాత్రం కార్పొరేష‌న్ ఏర్పాటు చేయ‌లేక పోయారు. దీంతో తాను అధికారంలోకి వ‌చ్చిన తొలి ఏడాదే.. ఆర్య‌వైశ్య కార్పొషేన్ ఏర్పాటు చేస్తాన‌ని చెప్పిన‌.. జ‌గ‌న్ ఆ మాట ప్ర‌కారం.. తొలి రెండు నెల‌ల్లోనే దీనిని ఏర్పాటు చేశారు. దీనికి చైర్మ‌న్‌గా కుప్పం ప్ర‌సాద్ ని నియ‌మించారు.

ఇక‌, తొలి విడ‌త‌లోనే కార్పొరేష‌న్‌కు రూ.100 కోట్లు కేటాయిస్తామ‌ని చెప్పినా.. 50 కోట్ల‌ను ఇచ్చి.. మిగిలిన మొత్తాన్ని త‌ర్వాత ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ బ‌కాయి నిధుల‌ను విడుద‌ల చేయ‌లేదు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్న ఆర్య‌వైశ్యుల్లో సుమారు 70 శాతం మంది.. పేద‌లు ఉన్నారు. అంద‌రూ వ్యాపారాల్లోనే మునిగి తేల‌డం లేదు. దీంతో కార్పొరేష‌న్ ద్వారా త‌మ‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌ని వీరు భావించారు.

అయితే.. కార్పొరేష‌న్ ఏర్పాటు, నిధుల మంజూరు వ‌ర‌కు బాగానే ఉన్నా.. త‌ర్వాత స్టెప్స్‌లో మాత్రం ఈ సామాజిక వ‌ర్గాన్ని ప‌క్క‌న పెట్టారు. మ‌రోసారి బ‌డ్జెట్‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్‌కు ఈ బ‌డ్జెట్‌లో అయినా.. పూర్తిస్థాయిలో న్యా యం జ‌రుగుతుందా? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే! ఎందుకంటే.. కార్పొరేష‌న్ ఖ‌ర్చుల‌కు సంబంధించిన లెక్క‌లు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కుకార్పొరేష‌న్ ద్వారా ఎంత‌మందికి ల‌బ్ధి చేకూర్చార‌నే విష‌యాల‌ను కానీ.. వెల్ల‌డించ‌లేదు.

అస‌లు నిధులు ఏమ‌య్యాయో కూడా లెక్క చెప్పేందుకు కార్పొరేష‌న్ సిద్ధంగా ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఇక‌, కార్పొరేష‌న్ కార్యాల‌యానికి నెలకు 25 వేల చొప్పున రెంట్ క‌డుతున్నామ‌ని.. నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు మ‌రో 20 వేలు అవుతోంద‌ని అంటున్నారే త‌ప్ప‌.. దీని ద్వారా ఎంత‌మందికి ల‌బ్ధి చేకూరిందో ఇత‌మిత్థంగా తెలియ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి తాజాగా ప్ర‌వేశ పెట్ట‌నున్న బ‌డ్జెట్‌పై ఏం చేస్తారో చూడాలి.

వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన‌ నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. సాధించుకునేందుకు.. అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు  త‌మ గ‌ళాన్ని వినిపించేందుకు వైశ్యుల ప‌క్షాన‌ న‌డుం బిగించింది  https://www.indiaherald.com. వైశ్య సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com  నిర్ణ‌యించింది.

వైశ్య సామాజిక వ‌ర్గం సోద‌రులు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు.. చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి వైశ్య‌ సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది  ​https://www.indiaherald.com/​​​


మరింత సమాచారం తెలుసుకోండి: