ఈ గురుకులాల్లో సీట్ల కోసం చాలా డిమాండ్ ఉంది. ఇన్ని చేస్తున్న కేసీఆర్ ఓ విషయం మాత్రం పట్టించుకోవడం లేదు. అదే ట్రిపుల్ ఐటీ సీట్ల పెంపు అంశం. ఈ ట్రిపుల్ ఐటీలను వైఎస్సార్ ప్రారంభించారు. తెలంగాణలోని బాసర, ఏపీలో నూజివీడు, ఇడుపులపాయలో ఈ ట్రిపుల్ ఐటీలు ఉండేవి. ఆ తర్వాత ఏపీలో మరో రెండు క్యాంపస్‌లు వచ్చాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఒంగోలు, శ్రీకాకుళంలో రెండు ప్రాంగణాలు ఏర్పాటు చేశారు.
కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటికీ ఒక్క బాసరలోనే ట్రిపుల్ ఐటీ ఉంది. తెలంగాణలో మరో ప్రాంగణాన్ని వనపర్తిలో ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అది ఇంకా ఏర్పాటు కాలేదు. పదో తరగతి మార్కుల ఆధారంగా 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు లో ప్రవేశాలు కల్పించే ఈ ట్రిపుల్ ఐటీ బాసరలో 1500 సీట్లు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రం మొత్తం నుంచి విద్యార్థులకు ఇవి సరిపోవడం లేదు. గత ఏడాది 40,158 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో సీటుకు సగటున 27 మంది పోటీపడ్డారన్నమాట.
మరో విషయం ఏంటంటే... ఈ 40 వేల మందిలో 10 జీపీఏ సాధించినవారే 9 వేల మందికి పైగా ఉన్నారు. ప్రవేశాల సంఖ్య పరిమితంగా ఉండటంతో పది జీపీఏ వచ్చిన సుమారు 7,500 మంది విద్యార్థులకు విద్యాలయంలో సీటు లభించలేదు. అంటే 7500 మంది అత్యుత్తమ ప్రతిభావంతులున్నా సీట్లు లేక వారికి అవకాశం దక్కలేదన్నమాట. ప్రస్తుతం బాసర ప్రాంగణంలో 2000 మంది విద్యార్థులకు అవసరమైన వసతులు ఉన్నాయి. ఈ క్రమంలో ఇక్కడ మరో 500 సీట్లు పెంచితే గ్రామీణ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. గురుకులాల సంఖ్య బాగా పెంచిన కేసీఆర్.. ఈ ట్రిపుల్ ఐటీలను విస్తరిస్తే అందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి