అయితే ఇప్పుడు ఇలాంటి పరిణామమే అధికార పక్షంలో ఒకరి విషయంలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాకి చెందిన దేవనకొండ సర్పంచి అభ్యర్థి వైసిపి పార్టీ వ్యక్తిపై ఫిర్యాదు చేస్తూ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాయడం, అంతే కాక ప్రెస్ మీట్ కూడా పెట్టడం చర్చకు దారితీసింది. వైసీపీ నేతను అయినటువంటి నాచేత ఖర్చు చేయించి ఆఖరికి ప్రత్యర్దుర్లకు మద్దతు ఇచ్చారు. వాళ్ళని నమ్ముకొని 40 లక్షలు ఖర్చు చేసాను. 15 లక్షలకి పొలం తాకట్టు పెట్టాను. ఇప్పుడు నా కుటుంబం రోడ్డున పడింది. ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆరోపిస్తున్నారు. సర్పంచ్ గీత.
వ్యవసాయం చేస్తూ సంతోషంగా జీవించే నన్ను ఎంతగానో ప్రేరేపించి ఎన్నికల బరిలోకి దించారు అని పేర్కొన్నారు గీత. ఇలా తన ఆవేదన బయట పెట్టింది. అయితే అధికార పక్షంలో కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయని.. ఇంత జరుగుతుంటే అధికార పార్టీ ఏం చేస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు ...ఇవన్నీ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఎత్తుగడని కొందరు కొట్టిపారేస్తున్నారు. మరి దీనిపై వైసిపి అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి