తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం రోజు రోజుకు మరింత రసవత్తరంగా మారిపోతుంది. అన్ని పార్టీలు కూడా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతిలో ఇక హోరాహోరీగా ప్రచారం చేస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు వెళ్ళిన సమయంలో రాళ్ల దాడి జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. అయితే రెండో సారి చిత్తూరు పర్యటనలో చంద్రబాబుకు ఇది ఊహించని చెప్పాలి. తిరుపతిలోని ప్రధాన రైల్వే కూడలి నుంచి కృష్ణాపురం వరకు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం చేపట్టారు



 అయితే ఇక ఈ ప్రచారం తర్వాత కృష్ణాపురం  పోలీస్ స్టేషన్  దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించారు చంద్రబాబు నాయుడు. ప్రతి ఒక్కరు టిడిపికి ఓటు వేసి పనబాక లక్ష్మిని గెలిపించాలి అంటు చంద్రబాబునాయుడు కోరారు. అయితే ప్రసంగం చివరి దశకు చేరుకున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చంద్రబాబును టార్గెట్ చేసి రాళ్ల దాడి చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పై రాళ్ల దాడి జరగడం సంచలనంగా మారిపోయింది. అయితే ఇలా టిడిపి గెలుస్తుందని భావించి అటు అధికారపక్షం ఇక రౌడీ మూకలతో రాళ్లదాడి చేయించింది అంటూ టిడిపి నేతలు అందరూ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.



 ఇకపోతే చంద్రబాబు పై జరిగిన రాళ్ల దాడి మాత్రం వాస్తవం కాదు అంటున్నారు అధికార వైసీపీ నేతలు. అదంతా చంద్రబాబు ఆడిన నాటకం అంటూ ఆరోపణలు చేస్తున్నారు.  చంద్రబాబు పై జరిగిన దాడి పై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు కొత్త నాటకానికి తెర లేపుతున్నారు అని ఎక్కడ ఎవరికి ఎలాంటి దెబ్బలు తగలలేదు అని చెప్పుకొచ్చాడు పెద్దిరెడ్డి. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని చంద్రబాబుది డ్రామా అని తేలితే వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ఏ పార్టీ గెలుస్తుందో అది అందరికీ తెలుసని చచ్చిన పామును కర్రతో కొట్టాల్సిన అవసరం తమకు లేదు అంటూ పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: