గత సంవత్సరం నుండి పట్టుకున్న కరోనా సమస్య...ఇప్పటికీ ప్రజలంతా దీని కోరల్లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. అంతా సర్దుమణిగిందనుకున్న సమయంలో మళ్ళీ సెకండ్ వేవ్ పేరుతో మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఇప్పటికే దేశంలోని పలు చోట్ల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ లు కూడా సినిమా షూటింగులను మరియు సినిమా విడుదలను కూడా వాయిదా వేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రేపో మాపో లాక్ డౌన్ విధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాలు అన్నీ కూడా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోమని పదే పదే చెబుతున్నా, కొంతమంది మాత్రం అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్ విడుదల అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకి సంబంధించిన ఫంక్షన్ ఒకటి జరిగింది. ఈ ఫంక్షన్ కి వచ్చిన వారిలో పవన్ కళ్యాణ్ కి చెందిన వ్యక్తికి కరోనా సోకిందని తెలియడంతో, అక్కడకి వచ్చిన వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ వెంటనే స్వీయ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆ తరువాత బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీనితో అందరూ కరోనా పరీక్షను చేయించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా  కరోనా టెస్ట్ చేయించుకోవడం జరిగింది. కరోనా టెస్టులో నెగటివ్ వచ్చినప్పటికీ, మళ్ళీ రెండు రోజుల తరువాత ఒళ్ళు నొప్పులు జ్వరం రావడంతో సందేహం కలిగి మళ్ళీ పరీక్షలు చేసుకోవడంతో పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని జనసేన కార్యదర్శి హరిప్రసాద్ ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియ చేయడం జరిగింది.

ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉంది. ఊపిరితిత్తుల్లో చిన్న పాటి నెమ్ము చేరడంతో చికిత్స జరుగుతోంది. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు. మెగా కుటుంబ సభ్యులంతా ఎప్పటికప్పుడు పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ ఉన్నారు.  ఈ చికిత్స అంతా కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్నవ్యవసాయ క్షేత్రంలోనే ఏర్పాట్లు చేశారు. అపోలో ఆసుపత్రి నుండి ప్రత్యేక బృందం వచ్చి ఈయనకు చికిత్సను అందిస్తున్నారు.  ప్రస్తుతం ఉన్న సమస్యలకు మందులు వాడుతూ ఉన్నారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు మరియు అభిమానుల ముందుకు వస్తానని పవన్ తెలిపారు. అయితే సమస్య ఏమీ లేదని అధికారికంగా చెబుతున్న సమాచారం. మరి ఆయన త్వరగా కోలుకుని సంతోషంగా ఉండాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: