మరోవైపు ఇక ఈసారి కూడా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని అధికార పార్టీ నేతలు అందరూ ధీమాతో ఉన్నారు. ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతి ఉప ఎన్నిక జరిగింది. అయితే ఇక తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ లో భాగంగా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపి కొంతమంది ని తీసుకొచ్చి ఇక దొంగ ఓటింగ్ కి పాల్పడింది అంటూ అటు ప్రతిపక్షం టిడిపి బిజెపి పార్టీలు ఇక ఏకంగా కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేయడం సంచలనం గా మారిపోయింది. వెంటనే ఎన్నికలు రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘాన్ని కూడా కోరాయ్ ప్రతిపక్ష పార్టీలు.
తిరుపతి ఉప ఎన్నికలను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించడంలో ఏపీ ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు విమర్శలు కూడా చేశారు. ఇక ఇటీవలే ఏకంగా ఉప ఎన్నిక రద్దు చేసి పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని మళ్ళీ కొత్తగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ దాఖలు చేసింది ఎవరో కాదు బిజెపి తరఫున తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన రమాప్రభ. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేసి మళ్ళీ కొత్తగా నిర్వహించాలని రమ ప్రభ పిటిషన్ వేయడం సంచలన గా మారిపోయింది అని చెప్పాలి. అయితే దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి