ఇక ఆ తర్వాత మొదలవుతున్నాయి పేద మధ్య తరగతి ప్రజలకు అసలు కష్టాలు. ఓవైపు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్దాం అంటే అక్కడ సరైన సదుపాయాలు లేక.. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్దాం అంటే అక్కడ ఫీజులు కట్టుకునే స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇక మెరుగైన వైద్యం తో పాటు కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చితే బాగుండు అని తెలంగాణ ప్రజానీకం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. అయితే అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంతో విజయవంతంగా అమలుచేస్తూ కరోనా చికిత్సను కూడా ఈ పథకంలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు
ఇలాంటి నేపథ్యంలో అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి ఇటీవలే వైయస్ షర్మిల కూడా ఈ అంశాన్ని తెరమీదికి తెచ్చింది. ఇంకెప్పుడు సీఎం సారు కరోనా వైరస్ చికిత్స ను ఆరోగ్యశ్రీలో చేర్చేది.. 100 మందిలో 10 మందికి కరోనా వస్తే పది మందిలో తొమ్మిది మంది పేదవాళ్ళు ఉన్నారు కరోనా వైరస్ తో రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది ఇప్పటికైనా కరోనా వైరస్ చికిత్స ఆరోగ్య శ్రీ లో చేర్చండి అంటూ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇలా ఇక ఏపీలో తన అన్న చేసిన పనే కెసిఆర్ను చేయమంటుంది షర్మిల.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి