కరోనా పాజిటివ్ వచ్చిన రోగికి వైద్యులు రాసిన మందులను తమ స్నేహితులు, సన్నిహితులకు పాజిటివ్ వచ్చినప్పుడు వైద్యుల సూచన లేకుండానే వాడేస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఆ మందుల వివరాలు తీసుకొని మందుల షాపుల్లో కొనుగోలు చేసి వాడుతున్నారు. వాస్తవంగా వ్యక్తి ఆరోగ్య స్థితి, దీర్ఘకాలిక వ్యాధులు వంటి వాటిని పరిగణలోకి తీసుకొని మందులు వాడాల్సి ఉంది. అలాకాకుండా మధుమేహం ఉన్నవారు సైతం స్టెరాయిడ్స్ వాడుతుండటంతో వారి పరిస్థితి విషమిస్తోంది. అంతేకాకుడా కొన్ని రకాల మందులతో డ్రగ్ ఎలర్జీలకు సైతం గురవుతున్నారు. యాంటీ వైరల్ డ్రగ్‌ను వైరస్ సోకినప్పుడు మాత్రమే వాడాలని వైద్యులు చెబుతున్నారు. లేకుంటే వెయిట్ లాస్, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి