చరిత్రలో నిలిచిపోయే రేంజ్ లో ఈ పర్పుల్ పింక్ డైమండ్ ధర పలికింది ఇక ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. 'సాకురా' అనే పర్ఫుల్ పింక్ డైమండ్ ను ఇటీవలే వేలం వేయగా ఏకంగా 213 కోట్లు పలికింది.ఇటీవలే హాంకాంగ్ కు చెందిన ఓ జ్యువెలరీ సంస్థ ఈ పర్పుల్ పింక్ డైమండ్ ను అమ్మకానికి పెట్టగా.. ఇది 213 కోట్లు పలికింది. అంతేకాదండోయ్ ఈ వజ్రం ప్రపంచంలోనే అతి పెద్దదైన డైమండ్ గా రికార్డును సైతం సృష్టించింది. 15.81 క్యారెట్ల ఈ అతిపెద్ద వజ్రం ను ఆసియాలోని బడా వ్యాపారి ఇక వేలంలో పోటీ పడి మరీ 213 కోట్లకు సొంతం చేసుకున్నాడు.
అంతే కాదు గుండె ఆకారంలో ఉన్న మరో 4.2 క్యారెట్ల పర్పుల్ అండ్ పింక్ డైమండ్ ఉంగరాన్ని కూడా ది స్వీట్ హార్ట్ పేరుతో వేలం వేయగా.. 29.3 మిలియన్ డాలర్లు పలికింది వజ్రం ధర. ఇది ఆభరణాల వేలం చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది అంటూ వేలం నిర్వహించిన సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయాన్ని ఇటీవలే తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఏదేమైనా డైమండ్ ఈ రేంజ్ లో ధర పలకడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి