ఈ క్రమంలోనే కరోనా వైరస్ పూర్తిగా నివారించే మందు కోసం దేశ ప్రజానీకం మొత్తం ఆశగా ఎదురుచూస్తుంది ఇలాంటి సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరు జిల్లాలో ఆనందయ్య అనే ఒక ఆయుర్వేదిక వైద్యుడు కరోనా కూ ఎన్నో ఔషధ మూలికల తో కూడిన ఆయుర్వేదిక్ మందు తయారు చేసాడు. అయితే కేవలం గంటల వ్యవధి లోనే ఈ ఆనందయ్య మందు కరోనా వైరస్ పై ప్రభావం చూపుతుంది అంటూ అటు మందు తీసుకున్న వాళ్లు కూడా చెప్పారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆనందయ్య మందు హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఈ క్రమం లోనే అటు ప్రభుత్వాలు కూడా ఆనందయ్య మందు పై పూర్తి స్థాయి పరిశోధనలు జరిపేందుకు సిద్ధమవుతున్నాయి ఇలాంటి తరుణంలో ఇటీవల తెలంగాణ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆనందయ్య మందు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణపట్నం ఆనందయ్య మందుతో కరోనా తగ్గలేదని.. ఆ మందు కళ్ళల్లో వేసుకున్న తరువాత విపరీతమైన మంట తో నేత్ర వైద్యుడు అయిన తనను ఎంతో మంది సంప్రదించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సంజయ్ కుమార్. వైద్యులు టెక్నాలజీతో కూడిన వైద్యం అందిస్తూ ఉంటే ప్రజలు అపోహలకు పోవడం సరైనది కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి