జీవితం మన చేతిలో ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. అలాగే ఊహించలేము కూడా. ఒక్కోసారి మనం అనుకున్నవి జరగకపోవచ్చు. లేక జరగవచ్చు.కొన్ని కొన్ని సంఘటనలు ఉంటాయి. అవి మనం ఊహించని విధంగా జరుగుతాయి. ఎప్పుడు మనం అనుకున్నది జరగదు. దురదృష్టవశాత్తు మనకు చెడు జరగాల్సిన చోట మంచి జరుగుతుంది. ఇక మన శత్రు దేశం పాకిస్తాన్‌లో చిక్కిన హైదరాబాద్ లో మాదాపూర్ కి చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అలాగే అచ్చమైన తెలుగు యువకుడు ప్రశాంత్‌ ఇటీవల ఆ పాకిస్తాన్ దేశం నుంచి విడుదలవ్వడం జరిగింది.ఇక ఈ రోజు హైదరాబాద్‌కు ప్రశాంత్ చేరుకోవడం జరిగింది. 2017వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో హైదరాబాద్ నుంచి ప్రశాంత్ కనిపించకుండా పోయాడు. సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేసే ప్రశాంత్.. 2017లో ప్రియురాలిని కలిసేందుకు స్విట్జర్లాండ్ వెళ్లే క్రమంలో ప్రశాంత్ పాక్ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో అతడ్ని వాఘా సరిహద్దులో భారత్‌కు పాక్ అధికారులు అప్పచెప్పారు.

పాకిస్తాన్‌ భూ భాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని ప్రశాంత్‌పై కేసు నమోదు చేసి, జైలులో పెట్టారు. ప్రశాంత్‌ను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే, ఆయన్ను కలిసేందుకు అనుమతించాలని భారత్ కోరింది. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు. దాదాపు నాలుగేళ్లపాటు జైలు జీవితం గడిపిన ఆయన్ను.. అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు సోమవారం అప్పగించడం జరిగింది.

ఇక మన తెలుగు యువకుడు ప్రశాంత్ ఇంటికి చేరుకోవడంతో అతని కుటుంబం ఆనందంలో మునిగితేలింది. 2019లో తన కుమారుడిని రప్పించే ప్రయత్నం చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను ప్రశాంత్ తండ్రి బాబురావు కలవడం జరిగింది. ఇక ప్రశాంత్‌ పాకిస్తాన్ నుంచి విడుదలయ్యి తిరిగి రావడంతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: