సౌదీలో రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. అక్కడి ప్రజలు క్రమశిక్షణతో లేకపోతే చర్యలు కచ్చితంగా తీసుకుంటారు. అయితే తాజాగా సౌదీ ఓ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం వల్ల మహిళలకు అనేక సమస్యలు తొలగిపోతాయి. 2017 సెప్టెంబ‌ర్‌లో మ‌హిళ‌ల‌కు డ్రైవింగ్ చేసే వెసులుబాటు క‌ల్పిస్తూ ప్ర‌త్యేక చ‌ట్టాన్ని సౌదీ అరేబియా తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు 17 ఏళ్లు నిండిన‌ యువ‌తుల‌కు కూడా డ్రైవింగ్ ప‌ర్మిట్‌ ఇవ్వ‌నున్న‌ట్లు చట్టం చేయడంతో చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు. 17 ఏళ్లు నిండిన‌ యువ‌తులు డ్రైవింగ్ ప‌ర్మిట్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని సౌదీ సర్కార్ ప్ర‌క‌టించింది. ఈ తాత్కాలిక డ్రైవింగ్ ప‌ర్మిట్ కోసం ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో యువ‌తుల‌కు మెడిక‌ల్‌ చెక‌ప్ ఉంటుంద‌ని పేర్కొంది. డ్రైవింగ్ స్కూళ్ల‌లో ఆరు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోల‌తో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని తెలిపింది. ఏడాది పాటు ఈ డ్రైవింగ్ ప‌ర్మిట్ చెల్లుబాటు అవుతుంద‌ని, 18 ఏళ్లు నిండిన త‌ర్వాత ఈ డ్రైవింగ్ ప‌ర్మిట్‌నే డ్రైవింగ్ లైసెన్స్‌గా మార్చుకోవ‌చ్చ‌ని సౌదీ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ స్ప‌ష్టం చేసింది.

అయితే, డ్రైవింగ్ లైసెన్స్‌ కోసం ద‌రఖాస్తు చేసుకునే యువ‌తుల‌కు కొన్ని ప్ర‌త్యేక ష‌ర‌తులు విధించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యానికి నిబంధ‌న‌ల మేర‌కు ఆయా యువ‌తుల‌పై డ్ర‌గ్స్‌కు సంబంధించి ఎలాంటి కేసులు ఉండ‌కూడ‌దు. డ్రైవింగ్‌కు ఇబ్బంది క‌లిగించే ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌రాదు. ట్రాఫిక్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు సంబంధించి జ‌రిమానాలు ఉంటే.. వాటిని క్లియ‌ర్ చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తుదారులు సౌదీయేత‌రులు అయితే రెసిడెన్సీ ప‌ర్మిట్ త‌ప్ప‌నిస‌రి. డ్రైవింగ్ స్కూళ్ల‌లో నిర్వ‌హించే థియేరిటిక‌ల్ టెస్టు పాస్ కావాలి. ఈ షరుతులతో కూడిన డ్రైవింగ్ లైసెన్సును ఇవ్వడానికి సౌదీ అరేబియా చర్యలు తీసుకుంటోంది. మరో వైపు కరోనా మహమ్మారి కారణంగా, ప్రతి సంవత్సరం నిర్వహించే ఇస్లామిక్ తీర్థయాత్రలో సంక్రమణ వ్యాప్తి చెందకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన అన్ని ఆరోగ్య, భద్రతా చర్యలతో ఈ ఏడాది హజ్ ముందుకు వెళ్తుందని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. యాత్రికుల ఆరోగ్యం, శ్రేయస్సును కాపాడటానికి ప్రామాణిక నిబంధనలు అమలులో ఉంటాయి. హజ్ తీర్థయాత్ర సౌదీ అరేబియా పరిధిలో వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: