జనాలు కూడా వారి లంచాలకు నిజంగానే అలవాటు పడిపోయారు. వారిపై పెద్దగా ఎవరూ ఫిర్యాదు చేయట్లేదు. అయితే ఎక్కడో చోట కొందరు మాత్రమే కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇక ఏసీబీ వారు కూడా అనేక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. లంచం తీసుకుంటూ దొరకిన వారిపై ఎన్నోసార్లు చర్యలు తీసుకుంటున్నారు. కొందరిన సస్పెండ్ చేస్తున్నారు. మరికొందరికైతే జైలు శిక్షకూడా పడుతోంది.
ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అయితే ప్రజలకు అత్యవసర సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ప్రభుత్వ ఆఫీసుల్లో పరిమిత సం ఖ్యలో అధికారులు, సిబ్బంది పనిచేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది ప్రబుత్వం. ఇదిలా ఉంటే లంచాలకు అలవాటు తిమింగళాలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తమ పని చేస్తున్నారు.
ఎవరు వచ్చి పని కావాలన్నా పైసలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారంట ఈ అవినీతి అధికారులు. దీంతో చాలా మంది బాధితులు ఈ అధికారుల అవినీతిపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా తమకు అందుతున్న అవినీతి ఫిర్యాదులపై అధికారులు కూడా బాగానే ఆధారాలు సేకరిస్తున్నారని సమాచారం. ప్రభుత్వ ఆఫీసర్లు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు తప్పకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబరు 1064 కు కంప్లైంట్లు చేయాలని పై అధికారులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి